Revanth Reddy:ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వెనక్కి, నకిరేకల్ కు రోడ్డు మార్గంలో రేవంత్

By narsimha lodeFirst Published Nov 24, 2023, 3:07 PM IST
Highlights

వాతావరణం అనుకూలించకపోవడంతో  తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్న నేతలు ఇబ్బందులు పడుతున్నారు.  వాతావరణం సరిగా లేకపోవడంతో  హెలికాప్టర్లలో ప్రయాణానికి నేతలు అవస్థలు పడుతున్నారు. 


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం అనుకూలించలేదు. కొంత దూరం ప్రయాణించి  తిరిగి వెనక్కి వచ్చారు రేవంత్ రెడ్డి. రోడ్డు మార్గంలో నకిరేకల్  నియోజకవర్గానికి వెళ్లాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  హెలికాప్టర్లు ప్రయాణించేందుకు వాతావరణం అనుకూలించడం లేదు. ఇవాళ  రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాల్సి ఉంది.  ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హెలికాప్టర్ లో కొద్ది దూరం వెళ్లిన తర్వాత  వాతావరణం అనుకూలించలేదు.  దీంతో  కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత తిరిగి హైద్రాబాద్ కు వచ్చారు రేవంత్ రెడ్డి.  రోడ్డు మార్గంలో  నకిరేకల్ కు బయలుదేరారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఇవాళ న్యూఢిల్లీ నుండి ప్రియాంక గాంధీ హైద్రాాబాద్ కు వచ్చారు.ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ వచ్చిన ప్రియాంక గాంధీ హెలికాప్టర్ లో పాలకుర్తికి వెళ్లాల్సి ఉంది. అయితే వాతావరణం అనకూలించకపోవడంతో  రోడ్డు మార్గంలోనే ప్రియాంక గాంధీ  పాలకుర్తికి చేరుకున్నారు. ప్రియాంక గాంధీ వెళ్లిపోయిన కొద్దిసేపటికి  ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో  బయలుదేరారు. అయితే  రేవంత్ రెడ్డి బయిలుదేరిన కొద్దిసేపటికే  వాాతావరణం అనుకూలించలేదు. ఈ విషయాన్ని పైలెట్లు రేవంత్ రెడ్డి బృందానికి చెప్పారు. దీంతో  హెలికాప్టర్ తిరిగి బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చింది. రోడ్డు మార్గంలో రేవంత్ రెడ్డి బృందం  నకిరేకల్ కు బయలుదేరింది.

also read:Revanth Reddy:ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వెనక్కి, నకిరేకల్ కు రోడ్డు మార్గంలో రేవంత్

మరో రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హెలికాప్టర్లలో  ఎన్నికల ప్రచార సభలకు వెళ్తున్న నేతలకు కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయాణీస్తున్న హెలికాప్టర్ మూడు దఫాలు ఇబ్బంది పెట్టింది. సాంకేతిక సమస్యతో సీఎం ప్రయాణీస్తున్న హెలికాప్టర్ ఇబ్బంది పెట్టింది. మరో వైపు రేవంత్ రెడ్డి ప్రయాణించిన  హెలికాప్టర్ లో కూడ ఒకసారి  సాంకేతిక సమస్య ఏర్పడిన విషయం తెలిసిందే.

 

 


 

click me!