Revanth Reddy: రేవంత్‌ రెడ్డి ఈ అరుదైన ఫోటో వెనుక ఉన్న స్టోరీ ఇదే.. అప్పుడు ఏం చేసేవాడో తెలుసా?

By Mahesh K  |  First Published Dec 5, 2023, 11:33 PM IST

సీఎం రేవంత్ రెడ్డి ఏబీవీపీలో పని చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆయన పాత్రికేయుడిగానూ పని చేశారు. జాగృతి అనే వీక్లీలో పని చేశాడు. ఆయన రిపోర్టర్‌గా పని చేస్తున్నప్పుడు మిత్రులతో కలిసి సుమారు మూడు దశాబ్దాల క్రితం దిగిన రేవంత్ రెడ్డి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 
 


హైదరాబాద్: రేవంత్ రెడ్డి ఎన్ని అవతారాలు ఎత్తుతారో! ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే రైటిస్టు నుంచి సెక్యులరిస్టుగా మారినట్టు స్పష్టం అవుతుంది. విద్యార్థిగా ఉన్నప్పుడు బీజేపీ విద్యార్థి అనుబంధ సంఘం ఏబీవీపీలో పని చేశాడు. కానీ, ఆ తర్వాత టీడీపీ, టీఆర్ఎస్‌, మళ్లీ టీడీపీలోకి వెళ్లి ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చీరాగానే కుంభస్థానాన్నే కొట్టారు. ఆయన సారథ్యంలో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన తర్వాత రేవంత్ రెడ్డి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి, వస్తున్నాయి. ఇందులో రేవంత్ రెడ్డికి సంబంధించిన అరుదైన విషయం, అరుదైన ఫొటో బయటికి వచ్చింది.

రేవంత్ రెడ్డి విద్యార్థి దశలో ఏబీవీపీలో పని చేస్తున్నప్పుడు జర్నలిస్టుగానూ చేశాడని తెలిసింది. ప్రజా సమస్యలపై అవగాహనతో విద్యార్థి రాజకీయాల్లోకి చేరిన ఆయన వాటిని ప్రభుత్వ దృష్టికి, సమాజంలో చర్చకు పెట్టడానికి పాత్రికేయుడిగా అవతారం ఎత్తినట్టు అర్థం అవుతున్నది. ఆయన జాగృతి వారపత్రికలో పని చేశాడు. ఇందుకు సంబంధించి ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. 

Latest Videos

undefined

Also Read : KCR: కాంగ్రెస్‌కు కేసీఆర్ సవాల్? నాలుగు నెలలు గడ్డుకాలమే!

ఆ పత్రికే ఎందుకు?

జాగృతి వార పత్రిక రైటిస్ట్ పత్రిక. అది ఆర్ఎస్ఎస్‌కు సంబంధించిన పత్రిక అంటుంటారు. అయితే, ఇలాంటి పత్రికలో రేవంత్ రెడ్డి ఎందుకు పని చేశాడనే సందేహాలూ వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఏబీవీపీలో పని చేశాడు. ఆ సందర్భంలోనే ఆయన జాగృతి పత్రికలో పని చేశారు. రైటిస్టు కార్యకర్త, నేతగా ఉన్నప్పుడు అదే భావజాలంతో పని చేసే(!) జాగృతి పత్రికలో పని చేయడం సహజమే అవుతుంది.

జర్నలిస్టుగా అవతారం ఎత్తడానే వార్త ఒకటైతే.. ఆయన జాగృతి వారపత్రికలో ఎందుకు పని చేశాడనే సందేహం ఇంకో వైపు మొదలైంది. వీటికి సంబంధించి రేవంత్ రెడ్డి గురించి తెలిసిన వారు సోషల్ మీడియాలో వివరాలను పంచుకుంటున్నారు.

Also Read : Revanth Reddy: రేవంత్ రెడ్డికి 2004లో కేసీఆర్ టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఉంటే..!

ఫొటోలో ఎవరెవరు?

వైరల్ అవుతున్న ఫొటోలో ఎడమ వైపున నలుపు రంగు చొక్కా ధరించిన వ్యక్తే రేవంత్ రెడ్డి. అప్పుడు రేవంత్ రెడ్డి తన మిత్రులు వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ(కార్టూనిస్టు కూడా), హరిగోపాల క్రిష్ణలతో కలిసి దిగిన ఫొటో ఇది. ఇది సుమారు మూడు దశాబ్దాల క్రితం నాటి ఫొటో కావడం గమనార్హం.

click me!