Kalvakuntla chandrashekar Rao:చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

Published : Nov 30, 2023, 12:05 PM ISTUpdated : Nov 30, 2023, 04:22 PM IST
Kalvakuntla chandrashekar Rao:చింతమడకలో ఓటేసిన  కేసీఆర్ దంపతులు

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు  గురువారంనాడు  చింతమడకలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు  గురువారంనాడు మెదక్ జిల్లాలోని చింతమడకలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.   గురువారం నాడు  ఉదయం  తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక హెలికాప్టర్ లో   చింతమడకకు చేరుకున్నారు.  చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు  భారీ ఎత్తున  క్యూలైన్లలో  ఓటర్లు నిలిచి ఉన్నారు.   ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు  మంత్రి హరీష్ రావు కూడ   చింతమడకకు చేరుకున్నారు.  కేసీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకొని  తిరిగి వెళ్లిపోయారు. 

2014, 2018 అసెంబ్లీ స్థానాల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి కేసీఆర్ ప్రాతినిథ్యం వహించారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి కూడ కేసీఆర్ బరిలోకి దిగారు.  గజ్వేల్ లో కేసీఆర్ పై  బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.  కామారెడ్డిలో కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి  పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 

 

తెలంగాణలో మూడో దఫా అధికారాన్ని  దక్కించుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. బీఆర్ఎస్ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  96 ఎన్నికల సభల్లో పాల్గొన్నారు.  బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాధ సభలను నిర్వహించింది. తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడ  రోడ్ షోలు, ఎన్నికల సభల్లో పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే  తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతలు కూడ విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,  సిద్ద రామయ్య,  డీకే శివకుమార్ ,రేవంత్ రెడ్డి తదితరులు విస్తృతంగా  ప్రచారం నిర్వహించారు.

also read:Bandi sanjay...జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కు రాజకీయాలు: కరీంనగర్ లో ఓటేసిన బండి సంజయ్

మరో వైపు  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,  కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా తదితరులు  కూడ బీజేపీ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో బీజేపీ, జనసేనల మధ్య పొత్తు ఉంది.  బీజేపీ  111 స్థానాల్లో పోటీ చేస్తుంది.  జనసేన  8 స్థానాల్లో బరిలో నిలిచింది. 

PREV
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు