కాంగ్రెస్ పై తెలంగాణ సీఎం విమర్శల తీవ్రతను పెంచుతున్నారు. ప్రతి రోజూ నాలుగు ఎన్నికల సభల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు.
ఖానాపూర్:ఆలోచించి ఓట్లు వేయకపోతే ఐదేళ్లు నష్టపోతారని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.ఆదివారంనాడు ఖానాపూర్ లో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి ప్రజా ఆశీర్వాద సభలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగించారు.గ్రామాల్లో ప్రజలు చర్చించి ఓట్లు వేయాలని ఆయన కోరారు.గత పదేళ్లకు ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా మారిందనే విషయాన్ని ఆలోచించాలని కేసీఆర్ ప్రజలను కోరారు.
గతంలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో సంక్షేమం ఎలా ఉంది, తమ పాలనలో సంక్షేమం ఎలా ఉందో ఆలోచించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పాలనలో కనీసం మంచినీళ్లు కూడ ఇవ్వలేని పరిస్థితి ఉండేదని కేసీఆర్ విమర్శించారు. తాము ప్రతి రోజూ ఇంటింటికి సురక్షిత మంచినీరు అందిస్తున్నామని కేసీఆర్ వివరించారు. రాష్ట్ర సంపద పెంచి పెన్షన్ ను అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారన్నారు.రైతు బందు దుబారా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మూడు గంటలు సరిపోతుందని రేవంత్ రెడ్డి చెబుతున్నాడన్నారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందా అని ఆయన అడిగారు. ధరణిని కూడ ఎత్తివేస్తామని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందన్నారు. ధరణి ఎత్తివేస్తే రైతు బంధు ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు.
undefined
కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధు, ఉచిత విద్యుత్ పోతాయని ఆయన చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపిస్తే ఐదు గంటల కంటే ఎక్కువ విద్యుత్ ను అందించడం లేదన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమారే ఈ విషయాన్ని చెప్పారన్నారు. తెలంగాణలో మాత్రం 24 గంటల విద్యుత్ ను అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతులకు కష్టాలు గ్యారంటీ..
కరెంట్ కాటకలుస్తది, రైతుబంధు ఖతం అయితది.
ఓటు వేసే ముందు ఆలోచించి వేయండి
- ఖానాపూర్ సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ pic.twitter.com/OvoMUpZjK2
తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తుంటే కర్ణాటకలో కేవలం ఐదు గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ లో కూడ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించడం లేదన్నారు.
ధరణిని తీసివేసి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే భూమాత పోర్టల్ పై కేసీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ తెచ్చేది భూమాతనా, భూమేతనా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ అని ఆయన గర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షే మ కార్యక్రమాలను అందిస్తున్న ప్రభుత్వం తమదేన్నారు. రాహుల్ గాంధీకి వ్యవసాయం, ఎద్దుల గురించి ఏం తెలుసునని కేసీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయం తెలియని రాహుల్ గాంధీ ధరణిని ఎత్తివేస్తామని చెబుతున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శల తీవ్రతను పెంచారు. ఖానాపూర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పాలనకు ఉన్న తేడాను చూడాలని ఆయన కోరారు. పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ సర్కార్ చేసిన పనులను వివరిస్తున్నారు.