Barrelakka : బర్రెలక్కకే 'మా' సపోర్ట్ : ప్రముఖ మూవీ యాక్టర్ కీలక ప్రకటన 

By Arun Kumar PFirst Published Nov 26, 2023, 2:08 PM IST
Highlights

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ పోటీచేస్తున్న బర్రెలక్క మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది. 

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కకు ఎవరూ ఊహించని విదంగా అనూహ్య మద్దతు దక్కుతోంది. తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై చేసిన ఒక్క రీల్ తో ఫేమస్ అయి బర్రెలక్కగా పేరు తెచ్చుకున్న కర్నె శిరీష తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఏదో పోటీచేసాం అన్నట్లుగా కాకుండా చాలా సీరియస్ గా ప్రచారం చేస్తున్న శిరీషకు సామాన్యుల నుండే కాదు ప్రముఖుల నుండి మద్దతు లభిస్తోంది. 

మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి బర్రెలక్క ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు బర్రెలక్కకు మద్దతివ్వగా తాజాగా తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ప్రముఖ తెలుగు సినీనటుడు సివిఎల్ నరసింహారావు ప్రకటించారు. ''MAA (Movie artists associaltion) of Telangana,  RAKSHA బేషరతుగా  మా బర్రెలక్కకి(శిరీష) కి సపోర్ట్ చేస్తున్నాం'' అంటూ సివిఎల్ సోషల్ మీడియాలో ద్వారా కీలక ప్రకటన చేసారు. 

Latest Videos

ఇక ఇప్పటికే యానాంకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మల్లాడి కృష్ణారావు, రిటైర్డ్ ఐపిఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ, సినీ హీరో నుండి మత బోధకుడిగా మారిన రాజా తదితరులు బర్రెలక్కకు మద్దతు ప్రకటించారు. తమ పక్షాన నిలిచి సీరియస్ గా ఫైట్ చేస్తుండటంతో నిరుద్యోగులు సైతం శిరీష గురించి పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇలా మద్దతు పెరుగుతుండటంతో రోజురోజుకు కొల్లాపూర్ ప్రజల్లో కూడా బర్రెలక్క గురించి చర్చ ఎక్కువ అవుతోంది. వారుకూడా ఆమెకు మద్దతిచ్చేందుకు సిద్దమవుతున్నారు. 

Read More  Barrelakka : నవతరం మహాత్మా గాంధీ బర్రెలక్కే... పవన్ కల్యాణ్ కంటే చాలా బెటర్ : రాంగోపాల్ వర్మ

తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బర్రెలక్కను ఏకంగా జాతిపిత మహిత్మా గాంధీతో పోల్చారు. అన్యాయంపై పోరాటం చేస్తున్న శిరీష్ నవతరం గాంధీ అంటూ వర్మ కొనియాడారు. తెలంగాణలో పోటీచేస్తున్న జనసేన కంటే బర్రెలక్కే సిరియస్ గా ప్రచారం చేసుకుంటోందని... పవన్ కల్యాణ్ కంటే ఈమె చాలా బెటర్ అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేసారు.  

నిరుద్యోగుల పక్షాన పోరాటంచేస్తానంటూ శిరీష నామినేషన్ వేసినా మొదట్లో ఆమె గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ప్రచారం చేసుకుంటున్న ఆమెతో పాటు తమ్ముడిపై జరిగిన దాడితో ఒక్కసారిగా ఆమెపై సానుభూతి పెరిగింది. ఓ ఆడబిడ్డ ఇంత ధైర్యంగా ఎన్నికల్లో పోటీచేస్తుంటే ఇలా దాడిచేయడం దారుణమంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇలా శిరీషపై జరిగిన దాడిని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్స్ పెరిగి మరోసారి బర్రెలక్క అనే పేరు మారుమోగింది. దీంతో ఈ విషయం రాజకీయ సినీ ప్రముఖుల వరకు చేరి వారు స్పందించడం ప్రారంభమయ్యింది.  

బర్రెలక్కకు దక్కుతున్న మద్దతు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఆమె గెలుస్తుందో లేదో తెలీదు... కానీ ఎన్నివేళ ఆమెను దక్కుతున్న మద్దతే గెలుపుతో సమానమని ఆమెను వెంట తిరుగుతున్నవారు అంటున్నారు. ఓ సామాన్యురాలికి ఈ  స్థాయిలో మద్దతు లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బర్రెలక్క హాట్ టాపిక్ గా మారారు.  

click me!