బండి సంజయ్ కు గుండెపోటు... ఇలాంటి డ్రామాలే నమ్మొద్దు..: గంగుల కమలాకర్ (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 21, 2023, 12:47 PM IST
Highlights

తాను మంత్రిగా చేసిన అభివృద్ది ఏమిటో చెబుతాను... ఎంపీగా గెలిచాక బండి సంజయ్ ఏం చేసాడో చెప్పలగడా? అని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. 

కరీంనగర్ : గత లోక్ సభ ఎన్నికల సమయంలో గుండెపోటు డ్రామాలాడి బిజెపి ఎంపీ బండి సంజయ్ గెలిచాడని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పుడు కూడా అలాంటివే మళ్లీ ఏదో డ్రామా ఆడేందుకు ఆయన రెడీగా వున్నాడన్నారు. ఏం చేసినా సంజయ్ ను కరీంనగర్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని... గత రెండుసార్లు  తన చేతిలో మరోసారి ఓడటం ఖాయమని బిఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. 

మంగళవారం ఉదయమే కరీంనగర్ పట్టణంలో ప్రచారాన్ని ప్రారంభించారు గంగుల. మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో కలిసి స్థానిక అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలిసారు గంగుల. ఈ సందర్భంగా తాను మంత్రిగా చేసిన అభవృద్దిని వివరించి... ఎంపీగా గెలిచాక బండి సంజయ్ ఏం చేసాడో చెప్పలగడా? అని గంగుల ప్రశ్నించారు. 

కరీంనగర్ కు స్మార్ట్ సిటీ , నిధులు తెచ్చింది తానేనని గంగుల అన్నారు. స్మార్ట్ సిటీ పనులు 2018 లోనే ముగిసాయి... 2019 లో సంజయ్ ఎంపీ అయ్యాడు... కానీ స్మార్ట్ సిటీ తెచ్చింది తానేనని సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అన్నారు. నాలుగున్నరేళ్లలో కరీంనగర్ అభివృద్ధికి సంజయ్ చారణ పైసలు కూడా తేలేదని అన్నారు. 

వీడియో

తెలంగాణ ప్రభుత్వం సెస్ పైసలు కేంద్రానికి కడితే కరీంనగర్ కు ఆర్వోబి మంజూరు చేసారని గంగుల తెలిపారు. పక్కనేవున్న సిద్ధిపేట వరకు వచ్చిన రైలును కరీంనగర్ వరకు తెమ్మంటే సంజయ్ కు చేతకాలేదని అన్నారు.  

ఇక పురుమళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ టికెట్ ఇప్పించిoదే బండి సంజయ్ అంటూ గంగుల సంచలన వ్యాఖ్యలు చేసారు. మైనార్టీ ఓట్లను చీల్చేందుకే పురుమళ్లను సంజయ్ బరిలోకి దింపాడని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పురుమళ్ల ఏనాడైనా మీకు కనిపించాడా? ఆయన్ని ఒక్కసారయినా చూసారా? అంటూ వాకర్స్ ను గంగుల అడిగారు. 

వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న తాను ఈసారి కూడా గెలిస్తే మళ్లీ మంత్రిపదవి దక్కనుందని గంగుల అన్నారు. ఈ పదేళ్ళలో కరీంనగర్ లో జరిగిన అభివృద్ధిని చూసి   నాకు ఓటెయ్యండని వాకర్స్ ను కోరారు గంగుల కమలాకర్. 

click me!