తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023: ఎనిమిది స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ

By narsimha lode  |  First Published Nov 13, 2023, 10:48 PM IST

తెలంగాణలోని  119 అసెంబ్లీ స్థానాల్లో  పోటీ చేస్తున్న బీఎస్పీకి  ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. ఎనిమిది స్థానాల్లో  ఆ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను రిజెక్ట్ చేశారు.



హైదరాబాద్: రాష్ట్రంలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో  బీఎస్‌పీ అభ్యర్ధుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.  దీంతో  111 అసెంబ్లీ స్థానాల్లో  మాత్రమే బీఎస్‌పీ అభ్యర్థులు బరిలో ఉంటున్నారు.  వివిధ కారణాలతో  ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో  బీఎస్పీ అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  బీఎస్‌పీ తన అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే  ఇవాళ నామినేషన్ల పరిశీలన నేపథ్యంలో  ఎనిమిది మంది అభ్యర్ధుల నామినేషన్లను  రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి, భువనగిరి, మిర్యాలగూడ,ఆలేరు,మధిర,బహదూర్ పుర, గోషామహల్ లో బీఎస్పీ అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.

Latest Videos

undefined

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎస్పీ  ఒంటరిగా బరిలోకి దిగింది.  బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగారు.  

లెఫ్ట్, బీఎస్పీతో కలిపి  పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. లెఫ్ట్ లో సీపీఐ మాత్రమే కాంగ్రెస్ తో జత కట్టింది. సీపీఎం, బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగింది. కాంగ్రెస్ కు తెలంగాణ జనసమితి మద్దతును ప్రకటించింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ  118 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఒక్క స్థానంలో సీపీఐకి మద్దతును ఇచ్చింది.  సీపీఎం ఒంటరిగా  బరిలోకి దిగింది. సీపీఐ పోటీ  చేస్తున్న స్థానంలో ఆ పార్టీకి మద్దతును ఇస్తుంది. ఇతర స్థానాల్లో  బీజేపీని ఓడించే అభ్యర్ధులకు మద్దతిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. 

click me!