Jeevan Reddy : నేను గెలిస్తే ఏం చేస్తానంటే..: ఏకంగా బాండ్ పేపర్ రాసిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి (వీడియో)

By Arun Kumar P  |  First Published Nov 27, 2023, 11:32 AM IST

తనను గెెలిపించి కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, జగిత్యాల అభ్యర్థి జీవన్ రెడ్డి బాండ్ పేపర్ రాసిచ్చారు. 


జగిత్యాల : ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ నాయకులు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎలాగూ ఎన్నికల మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి పార్టీలు ఎలాగూ హామీలు ఇస్తాయి... వీటితోపాటు కొందరు నాయకులు స్థానిక ప్రజలకు హామీ ఇస్తుంటారు. ఇలా తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వస్తే ఏమేం చేస్తుందో... ఎలా పాలిస్తుందో ప్రకటించింది. అయితే జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి  ఏకంగా బాండ్ పేపర్ పైనే హామీలను ప్రకటించారు. తాను గెలిచి... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జగిత్యాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానంటూ జీవన్ రెడ్డి బాండ్ పేపర్ రాసి ఇస్తున్నారు.  

ఇవాళ శ్రావణ సోమవారం సందర్భంగా జగిత్యాలలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు జీవన్ రెడ్డి. తన హామీలతో కూడిన బాండ్ పేపర్ పై స్వామివారి ఎదుటే సంతకం చేసారు. ఆ బాండ్ పేపర్ ను ఆంజనేయస్వామి పాదాలచెంత పెట్టి పూజించారు. ఆలయ అర్చకులు జీవన్ రెడ్డికి తీర్థప్రసాదాలు అందించారు.    

Latest Videos

undefined

అనంతరం ఈ బాండ్ పేపర్ లోని హామీలను ప్రస్తావిస్తూ జీవన్ రెడ్డి ప్రమాణం చేసారు. తెలంగాణవ్యాప్తంగా నవంబర్ 30న జరిగే పోలింగ్ లో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని... అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామంటూ ప్రమాణం చేసారు. ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను  ఖచ్చితంగా అమలుచేస్తామని అన్నారు. 

వీడియో

తనను గెలిపించే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో వుంటానని... వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్దికి అంకితం అమవుతానని మాటిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తానని అన్నారు. నిజాయితీ, నిబద్దతతో తన బాధ్యతలు నిర్వర్తిస్తానని... అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పనిచేస్తానని జీవన్ రెడ్డి ప్రమాణం చేసారు. 

Read More  Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికలు యమ కాస్ట్లీ గురూ... తాజాగా మరో ఐదు కోట్లు సీజ్

గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఇలాగే తన హామీపై ప్రజలకు నమ్మకం కల్పించేందుకు బాండ్ పేపర్ రాసిచ్చారు. నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకువస్తానంటూ అతడు బాండ్ పేపర్ రాసిచ్చిమరీ హామీ ఇవ్వడంతో ప్రజలు నమ్మారు.దీంతో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, సిట్టింగ్ ఎంపీగా వన్న కల్వకుంట్ల కవితను ఓడించగలిగారు. ఇదే ఫార్ములాను తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి వాడుతున్నారు. జగిత్యాల ప్రజలకు కాంగ్రెస్ హామీలపై నమ్మకం కల్పించేందుకు బాండ్ పేపర్ రాసిచ్చారు జీవన్ రెడ్డి. 


 

click me!