
Serilingampally Election Result 2023: శేరిలింగంపల్లి నియోజక వర్గంలో బీఆర్ఎస్ నుంచి అరెకపూడి గాంధీ, బీజేపీ నుంచి ఎం. రవికుమార్ యాదవ్, కాంగ్రెస్ నుంచి జగదీశ్వర్ గౌడ్ లు పోటీలో ఉన్నారు. కాగా ప్రస్తుతం శేరిలింగంపల్లి నియోజక వర్గంలో.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను వెనక్కి నెట్టేసి బీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాందీ 157332 మొత్తం ఓట్లలో 47 వేల 135 మెజార్టీతో మంచి విజయం సాధించారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 6,98,079 మంది ఓటర్లు ఉన్నారు. కాగా వీళ్లలో 3,70,301 మంది పురుషులు ఉన్నారు. మహిళలు 3,27,636 మంది ఉన్నారు. 142 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
అయితే గత 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో శేరిలింగం పల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన అరెకపూడి గాంధీ 44,295 ఓట్ల మెజర్టీతో టీడీపీ అభ్యర్థి ఆనంద ప్రసాద్ పై విజయం సాధించాడు. 2018 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ 51.22 శాతం ఓట్లను గెలుచుకుంది. ఇప్పుడు కూడా ఇక్కడ కారే గెలిచింది.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్