తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు కేసు నమోదైంది.
నిర్మల్: నిర్మల్ అసెంబ్లీ కేంద్రం నుండి బరిలో దిగిన తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. పార్టీ కండువాతో పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు వేసినందుకు గాను ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎల్లపెల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
2014, 2018 ఎన్నికల్లో నిర్మల్ నుండి ఇంద్రకరణ్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో బీఎస్పీ నుండి ఇంద్రకరణ్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీని బీఆర్ఎస్ శాసనసభపక్షంలో విలీనం చేశారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆయన బరిలోకి దిగి విజయం సాధించారు.
undefined
నిర్మల్ నుండి ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో మహేశ్వర్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.