తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు కల్వకుర్తి నియోజకవర్గ ఓటర్లు షాకిచ్చారు. 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్‌టీఆర్) ఓటమి పాలయ్యారు. 1989లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ స్థానాల నుండి ఎన్‌టీఆర్ పోటీ చేశారు. రాయలసీమలోని హిందూపురం అసెంబ్లీ స్థానంతో పాటు తెలంగాణలోని కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి ఆయన పోటీ చేశారు. కల్వకుర్తి అసెంబ్లీ స్థానంలో ఆయన ఓటమి పాలయ్యారు. హిందూపురంలో మాత్రం ఎన్టీఆర్ విజయం సాధించారు.
1985లో ఇదే అసెంబ్లీ స్థానం నుండి జె. చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కూడ జె. చిత్తరంజన్ దాస్ ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దింపింది. కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయినా కూడ ఎన్టీఆర్ పై చిత్తరంజన్ దాస్ విజయం సాధించారు. ఎన్టీఆర్ ను ఓడించి చిత్తరంజన్ దాస్ అప్పట్లో చరిత్ర సృష్టించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన చిత్తరంజన్ దాస్ కు జాయింట్ కిల్లర్ గా అప్పట్లో పేరు తెచ్చుకున్నారు.
undefined
కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ టీ ఆర్ ఓటమికి అనేక కారణాలను చెబుతారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగా పని చేయడం కూడ ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసి వచ్చింది. అప్పట్లో ఎంపీగా ఉన్న కాంగ్రెస్ నేత, మల్లు అనంతరాములు స్ట్రాటజీ కూడ కాంగ్రెస్ కు కలిసి వచ్చింది.
మరోవైపు సినీ నటుడు నాగభూషణం కూడ కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ టీ ఆర్ ఓటమి కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన నాగభూషణం ఎన్టీఆర్ ఓటమి కోసం కల్వకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
తన తరపున ఎవరిని బరిలోకి దింపినా విజయం సాధిస్తారని ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఓటమికి ప్రధాన కారణంగా మారాయి. మరో వైపు తెలంగాణ వాదులు కూడ ఈ నియోజకవర్గంలో ఎన్‌టీఆర్ ఓటమి కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
also read:k.chandrashekar rao...కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ కథ కంచికే: బీఆర్ఎస్ సభల్లో కేసీఆర్
ఎన్టీఆర్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన ప్రజలకు అందుబాటులో ఉండరు. చిత్తరంజన్ దాస్ ను గెలిపిస్తే స్థానికంగా ఉంటారని అప్పట్లో కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారం కూడ కాంగ్రెస్ కు కలిసి వచ్చిందని అప్పట్లో కాంగ్రెస్ విశ్వసించింది.
కల్వకుర్తిలో ఇప్పటివరకు గెలిచిన అభ్యర్ధులు వీరే
1952- ఎం. నర్సింగ్ రావు, కెఆర్ వీరాస్వామి ( కాంగ్రెస్)
1957- శాంతాబాయి తాత్పల్లికర్ ( కాంగ్రెస్)
1962-వెంకట్ రెడ్డి (ఇండిపెండెంట్),
1964- శాంతాబాయి తాల్పల్లికర్( కాంగ్రెస్)
1967- జి.రెడ్డి (ఇండిపెండెంట్)
1972- జైపాల్ రెడ్డి (కాంగ్రెస్)
1978- జైపాల్ రెడ్డి (జనతా పార్టీ)
1983- జైపాల్ రెడ్డి (జనతా పార్టీ)
1985- జె. చిత్తరంజన్ దాస్ (కాంగ్రెస్)
1989- జె. చిత్తరంజన్ దాస్ (కాంగ్రెస్)
1994- ఎడ్మ కిష్టారెడ్డి (ఇండిపెండెంట్)
1999- జైపాల్ యాదవ్(తెలుగుదేశం)
2004- ఎడ్మ కిష్టారెడ్డి (కాంగ్రెస్)
2009- జైపాల్ యాదవ్ (టీడీపీ)
2014 -చల్లా వంశీచంద్ రెడ్డి ( కాంగ్రెస్)
2018 -జైపాల్ యాదవ్(బీఆర్ఎస్)