Kodad Assembly Segment... కోదాడ నుండి ఎమ్మెల్యేలుగా: 2014లో అసెంబ్లీకి ఎన్. ఉత్తమ్,పద్మావతి దంపతులు

By narsimha lode  |  First Published Nov 23, 2023, 6:04 PM IST


నల్గొండ జిల్లా కోదాడ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది.ఈ నియోజకవర్గం నుండి  భార్యాభర్తలు ఎమ్మెల్యేలుగా  ప్రాతినిథ్యం వహించారు.  ఒకేసారి ఈ దంపతులు అసెంబ్లీలో అడుగుపెట్టారు.


నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఆయన సతీమణి  ఎన్.పద్మావతి రెడ్డి  ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఒకే అసెంబ్లీలో  ఉత్తమ్ దంపతులు  ఎమ్మెల్యేలుగా కొనసాగారు.


తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న కోదాడ అసెంబ్లీ స్థానం నుండి మరోసారి  పద్మావతి రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు.  ఇదే నియోజకవర్గం నుండి ఆయన సతీమణి కూడ గెలుపొందారు.  కోదాడ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి,  హూజూర్ నగర్ నుండి  ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు . వీరిద్దరూ ఒకేసారి  అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారు. 

Latest Videos

undefined

also read:kalwakurthy ఓటర్ల విలక్షణ తీర్పు: ఎన్‌టీఆర్ ఓటమి,మూడుసార్లు ఇండిపెండెంట్లకు పట్టం

1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుండి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి  ప్రాతినిథ్యం వహించారు.  నియోజకవర్గాల పునర్విభజనతో  కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. దీంతో  2009లో  హుజూర్ నగర్ నుండి  ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.  2014 ఎన్నికల్లో  కోదాడ నుండి ఎన్. పద్మావతి, హుజూర్ నగర్ నుండి  ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.  2018లో పద్మావతి ఓటమి పాలైంది.

also read:Telangana assembly elections 2023: సీఎం పదవిపై రేవంత్ రెడ్డికి అనుకూలంగా మల్లు రవి, విభేదించిన భట్టి

 2018 ఎన్నికల్లో  కోదాడ నుండి బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.  అయితే  ఈ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి  ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.  అయితే  2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. దీంతో  హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పద్మావతి రెడ్డి బరిలోకి దిగింది.అయితే  భారత రాష్ట్ర సమితి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి చేతిలో  నల్లమాద పద్మావతి ఓటమి పాలైంది.  ఈ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి నల్లమాద  ఉత్తమ్ కుమార్ రెడ్డి  మరోసారి బరిలోకి దిగుతున్నారు. కోదాడ నుండి  పద్మావతి రెడ్డి పోటీ చేస్తున్నారు.


 

click me!