కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజలకు హమీ ఇచ్చారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను ఇచ్చింది.
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రమాణం చేశారు. సోమవారంనాడు మధిర నియోజకవర్గంలోని చొప్పికట్లపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. అవినీతి రహితంగా పాలన చేస్తామని భట్టి విక్రమార్క ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేశారు. అంతేకాదు ఎన్నికల సమయంలో ఇస్తున్న ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఆయన ప్రమాణం చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఆలయంలో హామీలను చదివి వినిపించారు.ఈ ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ఇంగ్లీష్ లో చదివి వినిపించారు.
మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని చొప్పకట్లపాలెం ఆంజనేయ స్వామి ఆలయంలో 100 రూపాయల స్టాంప్ పేపర్ పై సంతకం చేశారు. ఈ స్టాంప్ పేపర్ పై ఆరు గ్యారంటీలతో పాటు నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
undefined
also read:kodangal కోటపై నిలిచిదేవరు?:రేవంత్ , పట్నం..రమేష్‌లలో కొడంగల్ ఓటర్లు పట్టం ఎవరికీ
మధిర అసెంబ్లీ స్థానంలో మల్లు భట్టి విక్రమార్కను ఓడించాలని బీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాంతో ముందుకు వెళ్తుంది. ఈ స్థానంలో భట్టి విక్రమార్క విజయం సాధించడని, సీఎం ఎలా అవుతారని కేసీఆర్ ప్రశ్నించారు. నాలుగు రోజుల క్రితం నిర్వహించిన ఎన్నికల సభలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై రెండు రోజుల క్రితం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. వందమంది కేసీఆర్, కేటీఆర్ లు వచ్చినా కూడ మధిర గేటును కూడ తాకలేరని ఆయన తేల్చి చెప్పారు.
also read:Barrelakka...కొల్లాపూర్ లో ఇండిపెండెంట్‌గా పోటీ: ఎవరీ బర్రెలక్క?
తెలంగాణలో సుధీర్ఘ పాదయాత్ర నిర్వహించారు మల్లుభట్టి విక్రమార్క. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా భట్టి విక్రమార్క కూడ ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు పాదయాత్ర నిర్వహించారు.ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.ఇదే సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.