Pawan Kalyan: తెలంగాణ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లో రౌడీలతో పోరాటం

By narsimha lode  |  First Published Nov 22, 2023, 4:51 PM IST

ఆంధ్రప్రదేశ్ లో తాను చేసే పోరాటాలకు  తెలంగాణతో ఉన్న సంబంధాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ లో పవన్ కళ్యాణ్  బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.


వరంగల్:తెలంగాణ స్పూర్తితోనే  ఆంధ్రప్రదేశ్ లో రౌడీలతో పోరాటం చేస్తున్నట్టుగా జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ చెప్పారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  బుధవారంనాడు వరంగల్ జిల్లాలో జరిగిన  భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు.

Latest Videos

undefined


తెలంగాణ ఇచ్చిన స్పూర్తితోనే పదేళ్లుగా పార్టీని నడుపుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.నాడు తెలంగాణకు మద్దతిచ్చిన వారిలో తాను కూడ ఒక్కడినని ఆయన  గుర్తు చేసుకున్నారు.

తన పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటుందన్నారు. ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో తెలంగాణలో కూడ అలానే తిరుగుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో  ఆ మార్పును సాధిస్తానని పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.బలిదానాలపై ఏర్పడిన రాష్ట్రం అవినీతిమయంగా మారడం  బాధ కల్గించిందని పవన్ కళ్యాణ్ వివరించారు.తనకు తెలంగాణ ఎంతో బలాన్ని ఇచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు  తాను  అండగా నిలుస్తానని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  హామీ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ ను ఎలా గుండెలో పెట్టుకొని చూసుకుంటానో తెలంగాణను కూడ అలానే చూసుకుంటానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.జనసేన ఆవిర్భవించిన తెలంగాణ ఇది అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇలాంటి తెలంగాణకు తాను  అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

అవినీతిరహిత తెలంగాణ కావాలని తాను కోరుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. గతంలో తాను గద్దర్ చేసిన చర్చల విషయాన్ని పవన్ కళ్యాణ్  గుర్తు చేసుకున్నారు. అవినీతి రహిత తెలంగాణ, సామాజిక తెలంగాణ రావాలని కోరుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. బీసీలు ముఖ్యమంత్రులు కావాలని  ఎదురు చూసినట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో  బీసీలు ముఖ్యమంత్రులుగా ఎక్కువ మంది ఉన్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి దళిత సీఎంను చూడలేదన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన  అభ్యర్ధిని  బీజేపీ ప్రకటించిందన్నారు. తెలంగాణలో  బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని సీఎం చేస్తానని బీజేపీ ప్రకటించిందన్నారు. అందుకే బీజేపీతో కలిసి  తెలంగాణలో పోటీ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.


 

click me!