mim mla akbaruddin owaisi: సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు

Published : Nov 22, 2023, 03:42 PM ISTUpdated : Nov 22, 2023, 03:46 PM IST
mim mla akbaruddin owaisi: సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు

సారాంశం

  హైద్రాబాద్  పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా చోటు చేసుకున్న ఘటన  చర్చకు దారి తీసింది.

హైదరాబాద్:  ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎమ్మెల్యే    అక్బరుద్దీన్ ఓవైసీపై హైద్రాబాద్ సంతోష్ నగర్ పోలీసులు  బుధవారంనాడు కేసు నమోదు చేశారు. 

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ   సంతోష్ నగర్ సీఐకు వార్నింగ్ ఇచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎన్నికల సమయం ముగిసి పోవడంతో  ప్రచారాన్ని ముగించాలని సీఐ  శివచంద్ర ఎమ్మెల్యే  అక్బరుద్దీన్ ఓవైసీకి సూచించారు. ప్రచారం ముగించడానికి ఇంకా ఐదు నిమిషాల సమయం ఉందని అక్బరుద్దీన్  సీఐకి చెప్పారు.ఈ విషయమై సీఐకి వార్నింగ్ ఇచ్చారు. కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలయ్యాయని తాను అలసిపోయాయని భావిస్తున్నారా అని  సీఐనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.తాను చాంద్రాయణగుట్ట ప్రజలకు సైగ చేస్తే  పరుగులు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.అయితే  ఈ విషయమై అక్బరుద్దీన్ ఓవైసీపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు