కామారెడ్డిలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అనుముల రేవంత్ రెడ్డిని ఓడించి బీజేపీ అభ్యర్ధి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి రికార్డు సృష్టించారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు.
హైదరాబాద్: కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఓడించి భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి కాటిపల్లి వెంకట రమణరెడ్డి విజయం సాధించారు. కేసీఆర్ పై 5,156 ఓట్ల మెజారిటీతో వెంకటరమణరెడ్డి గెలుపొందారు.ఇద్దరు కీలక నేతలను ఓడించి జాయింట్ కిల్లర్ గా పేరొందారు.
కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో కాటిపల్లి వెంకటరమణ రెడ్డికి 50,294 ఓట్లు వచ్చాయి. కేసీఆర్ కు 46,780 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 45,419 ఓట్లతో రేవంత్ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు.
undefined
ఈ ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో పాటు కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులు పోటీ చేశారు. వ్యూహాత్మకంగానే రెండు అసెంబ్లీ స్థానాల్లో కేసీఆర్ పోటీ చేశారు. గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో కేసీఆర్ విజయం సాధించారు. కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. కొడంగల్ తో పాటు కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి రేవంత్ రెడ్డి పోటీ చేశారు. కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో ప్రతి రౌండ్ లో విజయం దోబుచూలాడింది. తొలి రౌండ్లతో కేసీఆర్ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ముందంజలో నిలిచారు. అయితే అనుహ్యంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి చివరి రౌండ్లలో పుంజుకొని విజయం సాధించారు. రెండో రౌండ్ లో ఉన్న రేవంత్ రెడ్డిని చివరి రౌండ్లలో వెనుకబడ్డారు. రేవంత్ రెడ్డి మూడో స్థానంలో నిలవగా కేసీఆర్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణరెడ్డి విజయం సాధించారు.
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు విషయమై గతంలో రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ నిరసనలకు బీజేపీ అభ్యర్థి వెంకటరమణ రెడ్డి నాయకత్వం వహించారు. జిల్లా పరిషత్ చైర్మెన్ గా పనిచేయడంతో పాటు స్థానికంగా అన్ని గ్రామాల్లో వెంకట రమణరెడ్డికి మంచి పట్టుంది. అంతేకాదు తనను గెలిపిస్తే నియోజకవర్గంలో చేయనున్న కార్యక్రమాలపై నియోజకవర్గానికి ప్రత్యేకంగా మేనిఫెస్టోను కూడ విడుదల చేశారు. మరో వైపు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,రేవంత్ రెడ్డిలు స్థానికేతరులని వెంకటరమణ రెడ్డి ప్రచారం నిర్వహించారు. గెలిచినా, ఓడినా తాను కామారెడ్డి ప్రజల మధ్యే ఉంటానని వెంకటరమణ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు విషయంలో ఈ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.ఈ ఆందోళన సమయంలో వెంకటరమణ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈ ప్రాంత రైతుల ఆందోళనతో ప్రభుత్వం దిగి వచ్చింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసింది. కేసీఆర్ ను ఓడిస్తే మాస్టర్ ప్లాన్ ఊసెత్తరనే భావన కూడ స్థానికుల్లో వెళ్లేలా చేసిన ప్రచారం కూడ బీజేపీ అభ్యర్థికి కలిసి వచ్చింది.
also read:Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ అవసరాల రీత్యా కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేశారు. అయితే కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి పాలు కావడం కూడ ఆ పార్టీని షాక్ కు గురి చేసింది. కామారెడ్డిలో నామినేషన్ వేసిన సమయంలో బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకొంటామని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
also read:Kalvakuntla chandrashekar rao:గవర్నర్ కు రాజీనామా సమర్పించిన కేసీఆర్
కేసీఆర్ తో పాటు రేవంత్ రెడ్డికి కూడ వెంకటరమణ రెడ్డి షాకిచ్చారు. తెలంగాణసీఎంను సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఓడించి వెంకటరమణ రెడ్డి రికార్డు సృష్టించారు. ఇద్దరు కీలక నేతలను ఓడించి వెంకటరమణ రెడ్డి జాయింట్ కిల్లర్ గా పేరొందారు.