Telangana Elections:ట్రాఫిక్ జామంతా అక్కడే.. కారణం ఇదే..!

By telugu news team  |  First Published Nov 30, 2023, 2:54 PM IST

ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో ఉన్న చాలా మంది ఓటు వేయడానికి తమ సొంత ఊళ్లకు పయనమయ్యారు.  



Telangana Elections:ట్రాఫిక్ జామంతా అక్కడే.. కారణం ఇదే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తమ ఓటు హక్కు వినియోగించుకోవడినిక ప్రజలు ఉదయం నుంచే  పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలు కడుతున్నారు. ఇక, తమ ఓటు వినియోగించుకోవడానికి  సొంత ఊళ్లు పయనమౌతున్నవారు కూడా ఉన్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీ ట్రాపిక్ జామ్ కూడా అవ్వడం గమనార్హం.

Latest Videos

undefined

తెలంగాణలోని  మొత్తం 119 నియోజకవర్గాలకు ఈ పోలింగ్ జరుగుతోంది.  ఈ రోజు పోలింగ్ ఉదయం 7గంటలకు మొదలైంది. సాయంత్రం 5గంటలకు వరకు జరుగుతుంది. కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 3గంటల వరకు మాత్రమే పోలీంగ్ జరుగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో ఉన్న చాలా మంది ఓటు వేయడానికి తమ సొంత ఊళ్లకు పయనమయ్యారు.  ఓటర్ల వాహనాలతో హైదరాబాద్ - వరంగల్, హైదరాబాద్ - విజయవాడ హైవేలు రద్దీగా మారాయి. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ నెలకొన్నట్లు తెలుస్తోంది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయని తెలుస్తోంది. మధ్యాహ్న సమయం వరకు ఓఆర్ఆర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. 

అంతేకాకుండా, హైదరాబాద్ నగరంలో ఉన్న చాలా మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంత గ్రామాలకు వెళ్లడంతో హైదరాబాద్ నగరం చాలా వరకు ఖాళీ అయినట్లుగా తెలుస్తోంది. ఉదయం  5 గంటల నుంచే చాలా మంది ఓటు వేయడానికి బస్సులు,ట్రైనల్ లలో తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో నగరం బోసిపోయినట్లుగా మారడం గమనార్హం. 

ఈ సంగతి పక్కన పెడితే,  రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ విజయంపై ధీమాతో ఉన్నాయి. నేడు పోలింగ్ ముగియగానే, డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. డిసెంబర్ 3వ తేదీన ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. అదేరోజు సాయంత్రం ఫలితం వెలువడుతుంది.

ఇదిలా ఉండగా, ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈ రోజే విడుదల కానున్నాయి.  ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి చాలా సంస్థలు రెడీగా ఉన్నాయి. అయితే,  కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్పులతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవాళ వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ ముగిసిన అరగంట తరువాత అంటే సాయంత్రం 5.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ప్రకటించింది. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సాయంత్రం 6.30 గంటల తరువాతే విడుదల చేయాలని గతంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇప్పుడీ సమయంలో మార్పు చేసింది. కాబట్టి, ఈ రోజు సాయంత్రం 5గంటల 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. వాటి ద్వారా ఎగురు గెలుస్తారు అనే ఒక ఐడియా అయితే రానుంది. మరి, ఈసారి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి విజయ ఢంకా మోగిస్తారో లేక, చాలా కాలంగా విజయం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ మళ్లీ లీడ్ లోకి వస్తుందేమో చూడాలి.
 

click me!