కారు నాలుగు టైర్లలో గాలిపోయింది .. కేసీఆర్ దోచుకున్నదంతా కక్కిస్తాం : రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 26, 2023, 2:44 PM IST
Highlights

కారు నాలుగు టైర్లలో గాలిపోయిందని, బీజేపీ వాళ్లు వచ్చి ఛాతి చూపిస్తున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటారని, తెలంగాణ ఆదాయమంతటినీ సీఎం ఫ్యామిలీ దోంచుకుంటోందన్నారు. 

కారు నాలుగు టైర్లలో గాలిపోయిందని, బీజేపీ వాళ్లు వచ్చి ఛాతి చూపిస్తున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డిలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. కేసీఆర్ ధరణి పేరు చెప్పి ప్రజల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ అభివర్ణించారు. కేసీఆర్ చేసే పాలన కాంగ్రెస్ వల్లే వచ్చిందని , బీఆర్ఎస్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. ధరణి పోర్టల్‌ను గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములు గుంజుకున్నారని.. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో కేసీఆర్ చెబుతారా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. నిన్న రాత్రి అశోక్ నగర్‌లో తెలంగాణ యువతతో మాట్లాడానని.. పేపర్ లీక్ వల్ల ఎంతో నష్టపోయామని యువకులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. దొరల సర్కార్‌కు, ప్రజల సర్కార్‌కు మధ్య తేడా ఏంటో మేం చెబుతున్నాం, చూపిస్తామని రాహుల్ తెలిపారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసి ప్రజల పాలనను చూపిస్తామని.. తొలి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలపై సంతకం పెడతామని ఆయన హామీ ఇచ్చారు. మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఊరట కలిగిస్తామని రాహుల్ తెలిపారు. 

Latest Videos

Also Read: kodangal కోటపై నిలిచిదేవరు?:రేవంత్ , పట్నం..రమేష్‌లలో కొడంగల్ ఓటర్లు పట్టం ఎవరికీ

అంతకుముందు అందోల్‌లో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ... ల్యాండ్, సాండ్, మైన్స్, వైన్స్ అంతా కేసీఆర్ కుటుంబం చేతిలోనే వుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను, ఢిల్లీలో బీజేపీని ఓడిస్తామని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య మంచి స్నేహం వుందని.. ఢిల్లీలో మోడీకి కేసీఆర్.. తెలంగాణలో కేసీఆర్‌కు మోడీ సహకరిస్తారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటారని, తెలంగాణ ఆదాయమంతటినీ సీఎం ఫ్యామిలీ దోంచుకుంటోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కక్కిస్తామని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ తనపై 24 కేసులు పెట్టారని, నా ఎంపీ సభ్యత్వం రద్దు చేసి ఎంపీల క్వార్టర్స్ నుంచి బయటికి పంపించి వేశారని రాహుల్ ధ్వజమెత్తారు. 

click me!