ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రయత్నాలు ప్రారంభించింది. పాల్వాయి స్రవంతికి గాలం వేసింది. కాంగ్రెస్ ను వీడి పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
హైదరాబాద్:పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించిందని తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు.
భారత రాష్ట్ర సమితిలో మాజీ మంత్రి పాల్వాయి గోవర్థన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి ఆదివారంనాడు కల్వకుంట్ల తారకరామరావు (కేటీఆర్) సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో కేసీఆర్ సంప్రదింపులు సాగించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలనే ఆకాంక్షను పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వ్యక్తం చేసినట్టుగా ఆయన చెప్పారు.
undefined
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి ఒకరినొకరు తిట్టుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు మాత్రం ఒకరినొకరు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేశారో తెలియదన్నారు. కాంగ్రెస్ ను వీడి బీజేపీలో ఎందుకు చేరారు, తిరిగి కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు చేరారో తెలియదన్నారు.
తమ ప్రభుత్వం నల్గొండలో ఫ్లోరోసిస్ లేకుండా చేసిందని కేటీఆర్ చెప్పారు.మునుగోడులో తమ ప్రభుత్వం చేసిన పనులు ప్రజల కళ్లముందే ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. దేశంలోనే అతి పెద్దదైన అల్ట్రా మెగా పవన్ ప్రాజెక్టు నల్గొండ జిల్లాకే వస్తుందన్నారు. వ్యవసాయం, ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ కు ఏ మాత్రం అవగాహన లేదని ఆయన విమర్శించారు. మునుగోడులో మరోసారి గులాబీ జెండా ఎగరాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
అంతకు ముందు కాంగ్రెస్ ను వీడి భారత రాష్ట్ర సమితిలో చేరిన పాల్వాయి స్రవంతి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీని వీడే విషయమై తాను చాలా కాలంగా ఆలోచించినట్టుగా చెప్పారు. గత ఏడాది అక్టోబర్ మాసంలో జరిగిన ఉప ఎన్నికల నుండి ఇప్పటివరకు పార్టీలో అనేక అవమానాలు జరిగిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ పరిణామాలను చూసిన తర్వాతే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆమె తెలిపారు.
Live: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరికల కార్యక్రమం https://t.co/Vlhyck12rL
— BRS Party (@BRSparty)ఎక్కడ గౌరవం లేదో అక్కడ ఒక్క క్షణం కూడ ఉండాల్సిన అవసరం లేదనే విషయాన్ని తన తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నుండి నేర్చుకున్నట్టుగా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.
also read:కాంగ్రెస్‌కు పాల్వాయి స్రవంతి షాక్: రాజీనామా, బీఆర్ఎస్ లో చేరిక
కాంగ్రెస్ పార్టీలో తొలి నుండి ఉన్న వారిని అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు. తనకు తెలిసిన పార్టీ ఇది కాదని భావించినప్పుడు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు.మార్పునకు ఎక్కడో అక్కడ నాంది పలకాల్సిన అవసరం ఉందన్నారు.రాజకీయ రణరంగంలో ఓ అడుగు ముందుకేయాలనే భావనతో భారత రాష్ట్ర సమితిలో చేరినట్టుగా పాల్వాయి స్రవంతి తెలిపారు.