telangana assembly election 2023 : కొత్తగూడెంలో కాంగ్రెస్ సభ రద్దు .. హైదరాబాద్‌కు ప్రియాంకా గాంధీ

By Siva KodatiFirst Published Nov 24, 2023, 6:18 PM IST
Highlights

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కొత్తగూడెంలో నిర్వహించాల్సిన సభ అనివార్య కారణాలతో రద్దయ్యింది. రేపు ఖమ్మం, సత్తుపల్లిలో జరిగే ఎన్నికల ప్రచారంలో ప్రియాంకా గాంధీ పాల్గొననున్నారు. 
 

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కొత్తగూడెంలో నిర్వహించాల్సిన సభ అనివార్య కారణాలతో రద్దయ్యింది. దీంతో హుస్నాబాద్ నుంచి ఆమె నేరుగా హైదరాబాద్‌కు బయల్దేరారు. శుక్రవారం రాత్రి ప్రియాంకా గాంధీ తాజ్‌కృష్ణలో బస చేయనున్నారు. రేపు ఖమ్మం, సత్తుపల్లిలో జరిగే ఎన్నికల ప్రచారంలో ప్రియాంకా గాంధీ పాల్గొననున్నారు. 

అంతకుముందు హుస్నాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ప్రజలెవరూ సంతోసంగా లేరన్నారు. ఈ గడ్డ నుంచి వచ్చిన పీవీ నరసింమారావు అంటే సోనియా కుటుంబానికి ఎంతో గౌరవమని ప్రియాంకా తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రాజెక్ట్‌లను కేసీఆర్ పూర్తి చేశారా అని ఆమె ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌ల భూ నిర్వాసితులకు పరిహారం వచ్చిందా అని ప్రియాంకా గాంధీ నిలదీశారు. కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూరులో అభివృద్ధి జరిగిందా అని ఆమె ప్రశ్నించారు. 

Latest Videos

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎవరికీ మేలు జరగలేదని.. నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా వుందన్నారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చదువుకున్న యువత భవిష్యత్ చెడిపోయిందని ప్రియాంకా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు మంచి ఉద్యోగం లభించాలని తల్లిదండ్రులు కోరుకుంటారని ఆమె తెలిపారు. యువత కష్టపడి పరీక్షలు రాస్తే అవి లీక్ అయ్యాయని తెలిసిందని ప్రియాంక దుయ్యబట్టారు. పేపర్లు లీక్ కావడంతో యువత నిరాశకు గురయ్యారని.. రాష్ట్రంలో మహిళలకు కూడా రక్షణ లేదని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso Read: Priyanka Gandhi...బీఆర్ఎస్ సర్కార్ కు గడువు ముగిసింది:పాలకుర్తి సభలో ప్రియాంక గాంధీ

ఎస్సీలు, పేదలు, బలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం ఏం చేయలేదని ఆమె ఆరోపించారు. ప్రభుత్వంలో, ప్రాజెక్ట్‌ల్లో భారీగా అవినీతి జరిగిందని ప్రియాంక పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి పూర్తి చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన అన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ పూర్తయ్యిందని. మోడీ పాలనలో ధనికులకు తప్ప.. పేదలకు మేలు జరగలేదని ప్రియాంకా గాంధీ ఆరోపించారు.

ప్రధాని మోడీ.. దేశ సంపదనంతా ఆదానీకి అప్పగించారని ఆమె దుయ్యబట్టారు. ఇవాళ అదానీ రోజుకు రూ.1600 కోట్లు సంపాదిస్తున్నారని ప్రియాంకా గాంధీ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఎన్నికలు జరుగుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనను ప్రజలు చూశారని.. బీఆర్ఎస్ పాలనలో పేదలకు మేలు జరగలేదన్నది అందరికీ తెలిసిందేనని ప్రియాంకా గాంధీ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం వుందని.. ఈ రెండు పార్టీలకు ఎంఐఎం సహకరిస్తోందని ఆమె ఆరోపించారు.

ఇతర రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి ఎంఐఎం సహకరిస్తోందని ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసే ఎంఐఎం తెలంగాణలో మాత్రం 8 స్థానాల్లోనే ఎందుకు పోటీ చేస్తోందని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ కావాలనే మీ ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారని ప్రియాంకా గాంధీ గుర్తుచేశారు. ప్రజల సంపద ప్రజలకే చెందాలనేది కాంగ్రెస్ ఆశయమని.. పేదలకు మేలు చేసేందుకు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇస్తోందని ఆమె తెలిపారు. 
 

click me!