Raavi Narayana Reddy:నెహ్రు కంటే అత్యధిక ఓట్లు సాధించిన సీపీఐ నేత రావి నారాయణ రెడ్డి

By narsimha lodeFirst Published Nov 24, 2023, 5:38 PM IST
Highlights

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బొల్లేపల్లికి చెందిన రావి నారాయణ రెడ్డి  తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించినా తన ఆస్తిని పేదలకు పంచారు.

హైదరాబాద్: భారత దేశ ప్రథమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రు కంటే  అత్యధిక ఓట్లను కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణ రెడ్డి పొందారు. ఆనాడు పార్లమెంట్ లో ప్రధాని నెహ్రు  రావి నారాయణ రెడ్డితో  ప్రత్యేకంగా మాట్లాడారని  అప్పటి తరం నేతలు  చెబుతుంటారు. తన కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన రావి నారాయణ రెడ్డిని నెహ్రు అభినందించారని ఆ తరం నేతలు గుర్తు చేసుకుంటారు.తెలంగాణ సాయుధ పోరాట యోధుల్లో రావి నారాయణ రెడ్డి  ఒకరు.  రెండు దఫాలు పార్లమెంట్ సభ్యుడిగా, ఓ దఫా  అసెంబ్లీ సభ్యుడిగా రావి నారాయణ రెడ్డి పనిచేశారు. 

1952లో జరిగిన ఎన్నికల్లో  రావి నారాయణ రెడ్డి  నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి పీడీఎఫ్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.కమ్యూనిస్టులపై ఆ సమయంలో నిషేధం ఉండడంతో ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో  పోటీ చేశారు. పీడీఎఫ్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన రావి నారాయణ రెడ్డికి  3,09, 162 ఓట్లు వచ్చాయి. ఆనాడు  ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రుకు  2,33, 571 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Latest Videos

also read:Telangana Assembly Elections 2023: తెలంగాణలో కన్నడ రాజకీయం, ఎవరికీ లాభం?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని  భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో  రావి నారాయణరెడ్డి భూస్వామ్య కుటుంబంలో 1908 జూన్ 4న జన్మించారు. గోపాల్ రెడ్డి, వెంకట రామమ్మ లు నారాయణ రెడ్డి తల్లిదండ్రులు. 

విద్యార్ధి దశలోనే  రావి నారాయణ రెడ్డి  స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.  స్వగ్రామం బొల్లేపల్లిలో  రావి నారాయణ రెడ్డి  ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు.  భువనగిరి, హైద్రాబాద్ లలో ఆయన  విద్యాభ్యాసం చేశారు. హైద్రాబాద్ నిజాం కాలేజీలో  ఆయన  ఉన్నత విద్యను అభ్యసించారు. 

also read:Telangana assembly Elections 2023:2004 సెంటిమెంట్ కాంగ్రెస్ కు కలిసి వస్తుందా?

1930-34 లో శాసనోల్లంఘన ఉద్యమంలో రావి నారాయణ రెడ్డి భాగస్వామిగా ఉన్నారు.1938లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కూడ ఆయన పనిచేశారు.
విద్యార్ధి దశ నుండి రావి నారాయణ రెడ్డి క్రీడలపై ఆసక్తి ఉండేది. ఆయన  యువతను క్రీడల్లో రాణించాలని ప్రోత్సహించేవారు.

also read:Kodad Assembly Segment... కోదాడ నుండి ఎమ్మెల్యేలుగా: 2014లో అసెంబ్లీకి ఎన్. ఉత్తమ్,పద్మావతి దంపతులు

ఆనాడు సమాజంలో ఉన్న  అస్పశ్యతకు వ్యతిరేకంగా కూడ ఆయన పోరాటం చేశారు.1939లో  రావి నారాయణ రెడ్డి  సీపీఐలో చేరారు.  ఆనాడు నిజాం రాష్ట్రంలో  సాగుతున్న దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా  పోరాటం చేశారు. 11వ ఆంధ్రమహాసభకు  రావి నారాయణ రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ తెలంగాణ సాయుధ పోరాట సమయంలో  తన భూమిని పేదలకు పంచి పెట్టారు. తన భార్యపై ఉన్న నగలను గాంధీకి అందించి  పేదలకు  సహాయం చేయాలని కోరారు. 

click me!