Telangana Exit Poll Result 2023: చాణక్య ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు 78 స్థానాలు

By narsimha lodeFirst Published Nov 30, 2023, 5:54 PM IST
Highlights

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ  అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చాణక్య సర్వే సంస్థ  తెలిపింది.  ఈ మేరకు  ఆ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ను ఇవాళ విడుదల చేసింది. 

 హైద్రాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 67 నుండి  78 స్థానాలను కైవసం చేసుకుంటుందని చాణక్య  సర్వే సంస్థ  ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి.

కాంగ్రెస్ 67-78
బీఆర్ఎస్  22-31
బీజేపీ 6-9
ఎంఐఎం 6-7

Latest Videos

తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ  78 స్థానాలను గెలుచుకుంటుందని  చాణక్య సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్  ప్రకటించింది.  

తెలంగాణ రాష్ట్రంలో మూడో దఫా అధికారాన్ని దక్కించుకోవాలని  భారత రాష్ట్ర సమితి  ప్రయత్నిస్తుంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఈ దఫా తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని  కాంగ్రెస్ పార్టీ  వ్యూహత్మకంగా ముందుకు వెళ్లింది. దక్షిణాదిలో తెలంగాణలో  అధికారాన్ని  దక్కించుకోవాలని  కమలదళం అడుగులు వేసింది. తెలంగాణ రాష్ట్రంపై   బీజేపీ జాతీయ నాయకత్వం కూడ  ఫోకస్ పెట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆ పార్టీకి చెందిన అగ్ర నేతలు కూడ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 

also read:Telangana Exit Poll Result 2023... పోల్ ట్రెండ్స్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్: కాంగ్రెస్ కు 68 స్థానాలు

తెలంగాణ రాష్ట్రంలోని  119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.  బీఆర్ఎస్  119 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ  118 స్థానాల్లో తన అభ్యర్ధులను పోటీకి దింపింది.  ఒక్క స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని  సీపీఐకి కేటాయించింది.

click me!