Priyanka Gandhi...బీఆర్ఎస్ సర్కార్ కు గడువు ముగిసింది:పాలకుర్తి సభలో ప్రియాంక గాంధీ

By narsimha lode  |  First Published Nov 24, 2023, 4:38 PM IST

తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కార్ పై  కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ  విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. 


పాలకుర్తి:   బీఆర్ఎస్ సర్కార్ కు కూడ గడువు అయిపోయిందని ప్రియాంక గాంధీ చెప్పారు.మందులపై ఎక్స్ పైరీ డేట్ అయిపోయినట్టుగా బీఆర్ఎస్ సర్కార్ కు కూడ గడువు అయిపోయిందన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని  పాలకుర్తిలో  శుక్రవారంనాడు నిర్వహించిన  కాంగ్రెస్ ఎన్నికల  సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. 

ఇప్పటికే  కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ను ప్రకటించిందని  కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం  కష్టపడి  నిరుద్యోగుతు  ప్రిపేర్ అవుతుంటే  పరీక్షలు నిర్వహించమంటే ప్రభుత్వం పేపర్లు లీక్ చేస్తుందని  ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నిర్వహించిన  ఉద్యోగ పరీక్షల్లో  ఎంతో కుంభకోణం జరిగిందని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రెండు లక్షల ఉద్యోగాలను కల్పించినట్టుగా ప్రియాంక గాంధీ చెప్పారు. 

Latest Videos

తెలంగాణ సాధన కోసం ప్రాణాలు ఆర్పించిన తెలంగాణ అమరుల త్యాగాలు ఏ మేరకు  నెరవేరాయో ఆలోచించి ఓటేయాలని ఆమె తెలంగణ ప్రజలను కోరారు.  త్యాగం చేసిన వాళ్లు ఒకవైపు, దోపీడీ చేసిన వాళ్లు మరో వైపున్నారన్నారు. తెలంగాణ సాధన కోసం చేసుకున్న ఆత్మహత్యలను కూడ  ఈ ప్రభుత్వం వక్రీకరించిందని  ఆమె  విమర్శించారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే  రూ. 500లకు గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు.  మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో  ఉచితంగా  ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామన్నారు.

రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పాటు పడుతున్నాయని  ప్రియాంక గాంధీ  చెప్పారు.  తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం  ఏర్పడితే  రైతులకు  రూ. 2 లక్షల పంట రుణాలను  మాఫీ చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో  అత్యధిక మద్దతు ధర రైతులకు అందిస్తున్నామని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. ప్రతి ఏటా రైతులకు  రూ. 15 వేలు అందిస్తామన్నారు. అంతేకాదు  ప్రతి పంటకు బోనస్ గా రూ. 500 అందిస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.తెలంగాణలో యువశక్తి, నారీ శక్తిని చూస్తే తనకు గర్వంగా అనిపిస్తుందన్నారు.

also read:Revanth Reddy:ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వెనక్కి, నకిరేకల్ కు రోడ్డు మార్గంలో రేవంత్

పాలకుర్తిలో ఒక కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తే మరో కుటుంబం ప్రజల భూములు లాక్కుందని  ప్రియాంక గాంధీ  ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాల ఏర్పడిందన్నారు.త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ అభివృద్ది చెందాలని తాము భావించామన్నారు.పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరి ఆకాంక్షలు నెరవేరాల్సిన అవసరం ఉందని ప్రియాంక గాంధీ చెప్పారు.

 

LIVE: Public Rally | Palakurthi, Telangana.https://t.co/i4lQUDVWMP

— Priyanka Gandhi Vadra (@priyankagandhi)

పేపర్లు లీక్ కావడం చూసి కొందరు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఉద్యోగం కోసం ప్రిపేరౌతున్న యువతి ఆత్మహత్య చేసుకుంటే  ఆమె ఆత్మహత్య  గురించి ఈ ప్రభుత్వం వ్యంగ్యంగా మాట్లాడిన విషయాన్ని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు.ఆ యువతి పరీక్షకు అసలు ధరఖాస్తు చేసుకోలేదని మాట్లాడారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయని ప్రియాంక గాంధీ చెప్పారు.

పదేళ్ల పాటు అదికారంలో ఉన్న ఈ ప్రభుత్వం విర్రవీగుతుందని  ప్రియాంక గాంధీ చెప్పారు. సామాన్యులు,రైతుల సంక్షేమం గురించి ఈ ప్రభుత్వాలు మరిచిపోయాయని ప్రియాంక గాంధీ విమర్శించారు.ఈ ప్రభుత్వాల పాలనలో కిందిస్థాయి నుండి పైస్థాయి వరకు  అవినీతి పెరిగిపోయిందన్నారు.

 

click me!