Etela Rajender:నాడు కేసీఆర్‌ కుడి భుజం, నేడు ప్రత్యర్థి... బీఆర్ఎస్‌ నుండి బీజేపీకి ఈటల రాజేందర్ ప్రస్థానం

By narsimha lode  |  First Published Nov 29, 2023, 5:21 PM IST

తెలంగాణ ఉద్యమంలో  ఈటల రాజేందర్  కీలకపాత్ర పోషించారు.  ఒకనాడు  బీఆర్ఎస్‌లో  కీలకంగా పనిచేసిన రాజేందర్  ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా మారాడు.
 


హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఒకప్పుడు కుడి భుజంగా  ఈటల రాజేందర్ (Etela Rajender)వ్యవహరించారు. కానీ, ఈటల రాజేందర్ పై భూఆక్రమణల నేపథ్యంలో  కేసీఆర్ తన మంత్రివర్గం నుండి  తప్పించారు. బీఆర్ఎస్ నుండి తప్పించిన తర్వాత  ఈటల రాజేందర్ బీజేపీ (Bharatiya janata party)లో చేరారు. బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే  బీసీని సీఎం చేస్తానని ప్రకటించింది.  సీఎం రేసులో  బండి సంజయ్ తో పాటు  ఈటల రాజేందర్ పేరు  సాగుతుంది. విద్యార్ధి ఉద్యమ సమయంలో  లెఫ్ట్ విద్యార్ధి సంఘంలో  కీలక నేతగా ఈటల రాజేందర్ పనిచేశారు.

Latest Videos

undefined

తెలంగాణ ఉద్యమంలో  ఈటల రాజేందర్ కీలకంగా పనిచేశారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగిన తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్  కీలకపాత్ర పోషించారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) శాసనసభపక్షనేతగా  పనిచేశారు. 

1964 మార్చి  20న కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ లో  ఈటల రాజేందర్ జన్మించారు.బాల్యంలో హస్టల్ లో ఉంటూ  విద్యాభ్యాసం చేశారు.  హైద్రాబాద్ లో  కాలేజీ విద్యాభ్యాసం చేసే సమయంలో  లెఫ్ట్ విద్యార్థి సంఘంలో రాజేందర్ కీలకంగా వ్యవహరించారు. కానీ, ప్రస్తుతం ఆయన బీజేపీలో  కీలక నేతగా కొనసాగుతున్నారు. 1984లో ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఆయన బీఎస్‌సీ పట్టా పొందారు.

ముదిరాజ్ సామాజిక వర్గానికి ఈటల రాజేందర్  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన  జమునను (Etela jamuna)వివాహం చేసుకున్నారు.వీరికి ఇద్దరు సంతానం. 2003లో ఈటల రాజేందర్  బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరడానికి ముందుగా ఆయన వ్యాపార రంగంలో  ఉన్నారు. పౌల్ట్రీ వ్యాపారాల్లో ఈటల రాజేందర్ చేసేవారు.  రాజేందర్  రాజకీయాల్లో చేరిన తర్వాత  ఆయన సతీమణి జమున పౌల్ట్రీ వ్యాపారాలు చూసుకుంటున్నారు.

బీఆర్ఎస్‌ లో చేరిక

2003లో  ఈటల రాజేందర్  బీఆర్ఎస్ లో చేరారు.  తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ క్రియాశీలకంగా వ్యవహరించారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమలాపూర్ (kamalapur Assembly segment)  అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్ధిగా  ఈటల రాజేందర్  బరిలోకి దిగి  2004లో  తొలిసారిగా  అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలుగుదేశం నేత,మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి (Muddasani Damodar Reddy)ని  ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 

ఇక అప్పటి నుండి ఆయన  ఓటమిని చవిచూడలేదు.2008 ఉప ఎన్నికల్లో కమలాపూర్ నుండి ఆయన విజయం సాధించారు.  2009లో  నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దీంతో  కమలాపూర్ నియోజకవర్గం హుజూరాబాద్ (huzurabad assembly segment) గా మారింది.2009 నుండి హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  ఈటల రాజేందర్  విజయం సాధించారు.  

బీజేపీలో చేరిక

2010 ఉప ఎన్నికల్లో కూడ ఆయన గెలుపొందారు.2014, 2018 ఎన్నికల్లో  హుజూరాబాద్  నుండి ఆయన  విజయం సాధించారు.  2018 వరకు  బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆయన పోటీ చేసి విజయం సాధించారు.  2021లో బీఆర్ఎస్ వేటేయడంతో బీజేపీలో చేరారు. 

2021 అక్టోబర్ 30న జరిగిన ఉప ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి హుజూరాబాద్ నుండి  ఈటల రాజేందర్ విజయం సాధించారు.  2023 సాధారణ ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్ధిగా మరోసారి హుజూర్ నగర్ నుండి  మరోసారి బరిలోకి దిగారు.  అంతేకాదు  ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నుండి కూడ  ఈటల రాజేందర్  పోటీ చేస్తున్నారు.


 
2014 లో  తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో  బీఆర్ఎస్  సర్కార్ ఏర్పాటైంది.  తొలి తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రిగా  ఈటల రాజేందర్ పనిచేశారు.2018లో  తెలంగాణలో రెండో దఫా కేసీఆర్ నేతృత్వంలో  బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటైంది. రెండో దఫా కూడ  కేసీఆర్ మంత్రివర్గంలో  ఈటల రాజేందర్ కు మంత్రి పదవి దక్కింది.  వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పదవిని కేసీఆర్ కేటాయించారు. 

2018 ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు  కొందరు ప్రయత్నించారని ఈటల రాజేందర్ ఆరోపించారు. అంతేకాదు  గులాబీ జెండాకు తామే ఓనర్లమని కూడ  ఆయన వ్యాఖ్యలు చేశారు.  ఈ వ్యాఖ్యలు అప్పట్లో  బీఆర్ఎస్ లో చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యల తర్వాత  ఆయన కేసీఆర్ తో భేటీ అయ్యారు.  పరిస్థితి సద్దుమణిగినట్టు కన్పించింది.  

అయితే  2021లో  ఈటల రాజేందర్  పేదల భూములను ఆక్రమించినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ విషయమై విచారణకు కేసీఆర్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 2021 మే 1న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుండి ఈటల రాజేందర్ ను  భర్తరఫ్ చేశారు కేసీఆర్. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు.  ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా ఉన్నారు.  బీజేపీ నాయకత్వం  ఈ ఏడాది జూలై 4న రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్ పదవిని కేటాయించింది.
 

click me!