సీఎం కుర్చీ చుట్టే బండి సంజయ్ ప్రచారం.. బీజేపీలో కూడా సీఎం సీటు పంచాయితీ?

By Mahesh K  |  First Published Nov 16, 2023, 6:17 PM IST

సీఎం సీటు పై బీఆర్ఎస్‌లో.. కాంగ్రెస్‌లో పంచాయితీ ఉన్నదని విమర్శిస్తున్న బండి సంజయ్ ఇటీవలే ఆయననే సీఎం.. సీఎం.. అని సభకు వచ్చిన ప్రజలు పేర్కొనగా ఆయన ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. బీసీ సీఎంను చేస్తామని ప్రధాని ప్రకటన చేసిన తర్వాత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్య చేసిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈటల వర్సెస్ బండి అన్నట్టుగా మారిందని చర్చ జరుగుతున్నది.
 


హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఈ మధ్య ప్రచారం మొత్తం సీఎం సీటు చుట్టూ తిప్పుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో సీఎం సీటు కుంపటి ఉన్నదని ముమ్మరంగా ప్రచారం చేసిన సంగతి తెలిసందే. కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా మధ్యంతర ఎన్నికలు ఖాయం అని అన్నారు. ఎందుకంటే ఈ సీఎం సీటే కారణం అని పేర్కొన్నారు. అయితే.. ఈ సీఎం సీటు పంచాయితీ బీజేపీలో కూడా ఉన్నదా? కానీ, బయటపడట్లేదా? అనేది చర్చనీయాంశమైంది.

బీఆర్ఎస్‌లో తదుపరి సీఎంను కేటీఆర్‌ను చేయాలని కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్ పై ఒత్తిడి తెస్తున్నారని, అలా చేస్తే హరీశ్ రావు, కవిత పార్టీని చీల్చుతారని బండి సంజయ్ చెప్పారు. కాంగ్రెస్‌లో కూడా సీఎం సీటు రేసు మామూలుగా లేదని, మెజార్టీ సీట్లు వస్తే సీఎం సీటుపై ఎటూ తేలదని కామెంట్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల గురించి ఈ కామెంటు చేసిన బండి సంజయ్.. ఆయననే సీఎం అని సభకు వచ్చిన వారు అంటే కీలక వ్యాఖ్య చేశారు.

Latest Videos

undefined

బిచ్కుంద క్యాంపెయిన్‌లో నిన్న మాట్లాడుతుండగా.. సభకు వచ్చిన వారు సీఎం.. సీఎం.. సీఎం.. అని అరిచారు. దీంతో బండి సంజయ్ ఫన్నీగానే సీరియస్‌ కామెంట్ చేశారు. సీఎం.. సీఎం... అనే అధ్యక్ష పదవిని పీకేశారని అన్నారు. మళ్లీ ఇప్పుడు కూడా ఇలాగే అని ఇప్పుడున్న పోస్టును కూడా తీసేస్తారా? అని నవ్వుతూ పేర్కొన్నారు. వెంటనే మరో కామెంట్ చేశారు.

Also Read: Regional Parties: కేసీఆర్‌కు ఇంకా ‘థర్డ్ ఫ్రంట్’ ఆశలు? సాధ్యం అవుతుందా? ఎందుకీ కామెంట్ చేశారు?

ప్రధాని మోడీ బీజేపీ వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించారని బండి సంజయ్ గుర్తు చేశారు. బీసీ సీఎం కావాల్నా? వద్దా? అని హుషారుగా అడిగారు. అంతే హుషారుగా కావాలని సభకు వచ్చినవారు అన్నారు. బీజేపీలో కీలకమైన బీసీ నేతలుగా ఈటల రాజేందర్, బండి సంజయ్, కే లక్ష్మణ్‌లు ఉన్న సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే సీఎం సీటుపై ఈ పార్టీ నేతల నుంచి పెద్దగా కామెంట్లు బయటకు రావడం లేదు. అయితే.. ఈటల రాజేందర్ మాత్రం ఆ ప్రకటన చేశారు. ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని, బీజేపీ అధికారంలోకి వస్తే తననే సీఎం చేస్తానని అన్నారని ఈటల రాజేందర్ అన్నారు. దీంతో మరోసారి ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ మొదలవుతుందా? అనే టాక్ వచ్చింది. ఇతర పార్టీల్లోని సీఎం సీటు పై విమర్శలు కురిపిస్తున్న బండి సంజయ్ మాత్రం తాను సీఎం కావడంపై మాట్లాడటం లేదు.

click me!