ముగిసిన నామినేషన్ల పరిశీలన ... ఏకంగా 772 సెట్ల తిరస్కరణ ... ఆ సీనియర్లకు బిగ్ షాక్

By Arun Kumar P  |  First Published Nov 14, 2023, 7:13 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు, వాటి పరిశీలన ప్రక్రియ ముగిసింది. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసి బరిలో నిలిచే అభ్యర్థులెవరో ఫైనల్ కానుంది. 


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల టికెట్ దక్కిన అభ్యర్థులే కాదు రెబల్ అభ్యర్థులు, ఇండిపెండెంట్ గా పోటీచేసేవారు... ఇలా భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 5,716 సెట్ల నామినేషన్లు దాఖలయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నామినేషన్ల పరిశీలన కూడా నిన్నటితో ముగిసింది. 

నిబంధనలు అనుసరించి సరైన పత్రాలతో దాఖలయిన నామినేషన్లను మాత్రమే ఆమోదించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇలా అన్నీ సక్రమంగా వున్న  3,307 సెట్ల నామినేషన్లను స్వీకరించినట్లు తెలిపారు. నిబంధనలు పాటించకుండా దాఖలుచేసిన 772 సెట్ల నామినేషన్లను ఈసి పరిశీలకులు తిరస్కరించారు. ఇలా నామినేషన్లు తిరస్కరణకు గురయిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఇటీవలే బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన మోత్కుపల్లి నర్సింహులుతో పాటు మరికొందరు వున్నారు. 

Latest Videos

undefined

రాష్ట్రవ్యాప్తంగా వున్న 119 నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు పోటీకి సిద్దమయ్యారు. వీరిలో బిఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ తో పాటు కాంగ్రెస్, బిజెపి నాయకులు రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ వంటివారు రెండు చోట్ల పోటీచేస్తుండంతో రెండేసి నామినేషన్లు దాఖలు చేసారు. ఇలాగే మరికొందరు నాయకులు ఒకే నియోజకవర్గం నుండి రెండేసి సెట్ల నామినేషన్లు దాఖలు చేసారు. దీంతో అభ్యర్థుల సంఖ్య కంటే నామినేషన్ల సంఖ్య ఎక్కువగా వుంది.  

Read More  Janareddy: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి దిమ్మతిరిగే షాకిచ్చిన ఎన్నికల అధికారులు..

నామినేషన్ల పరిశీలన తర్వాత 3,307  నామినేషన్లను మాత్రమే ఈసి పరిగణలోకి తీసుకుంది. వివిధ కారణాలతో 772 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇలా నిన్నటితో నామినేషన్ల పరిశీలన  పూర్తవగా ఈ నెల 15తో అంటే రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగియనుంది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరో ఫైనల్ కానున్నారు. 

click me!