ఫస్ట్ టైమ్ ఓటర్లు: ఆంధ్రా కంటే తెలంగాణలోనే ఎక్కువ

Siva Kodati |  
Published : Apr 10, 2019, 09:55 AM IST
ఫస్ట్ టైమ్ ఓటర్లు: ఆంధ్రా కంటే తెలంగాణలోనే ఎక్కువ

సారాంశం

గణాంకాలను బట్టి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య (60,129) ఎక్కువగా ఉంది.   

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. తెలంగాణలో సుమారు 5,99,933 మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

వీరిలో 18 నుంచి 19 ఏళ్ల వారే ఎక్కువ. 17 లోక్‌సభ స్థానాల పరిధిలో మూడు ఎస్సీలకు, రెండు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఎన్నికల కోసం 34,603 పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఈసీ ఏర్పాటు చేసింది.

కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,95,30,838... వీరిలో 1,48,42,582 మంది పురుషులు, 1,46,74,217 మంది మహిళలు, 2,089 మంది థర్డ్ జెండర్లు. వీరు కాక 10,823 మంది సర్వీస్ ఓటర్లు, 1,127 మంది ఓవర్‌సీస్ ఓటర్లున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే 5,39,804 మంది తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 2014తో పోలిస్తే ఓటర్ల సంఖ్య 12,58,015 మంది పెరిగారు.. అంటే 1.94 శాతం పెరుగుదల. ఈ గణాంకాలను బట్టి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య (60,129) ఎక్కువగా ఉంది. 

PREV
click me!

Recommended Stories

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.... సంక్రాంతి పండుగకి....
మంత్రి పదవి కన్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కే నా ఓటు: కేటీఆర్