కేసీఆర్ నాకు టికెట్ ఇవ్వకపోవడం బాధించింది...కానీ: పొంగులేటి

By Arun Kumar PFirst Published Apr 9, 2019, 8:59 PM IST
Highlights

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన ఇవాళ అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచార సభలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కు మద్దతుగా కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి తగ్గట్లే తాను నడుచుకుంటున్నట్లు తెలిపారు.

గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగి మళ్లీ తనకే అవకాశం వస్తుందని అనుకున్నానని అన్నారు. కానీ అనూహ్యంగా రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఆ అవకాశాన్ని ఇవవ్వలేదని...అది తననెంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కేసీఆర్ అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారని అందువల్లే ఆయన నిర్ణయానికి తాను కట్టుబడివున్నట్లు పొంగులేటి తెలిపారు.

అందువల్ల ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు భారీ మెజారిటీతో గెలిపించుకుని ముఖ్యమంత్రికి కానుకగా ఇద్దామని కార్యకర్తలకు సూచించారు. మనందరి కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి నామాను గెలిపించాలని ఆదేశించారని...దీన్ని నాయకులు, కార్యకర్తలు  శిరసావహించాలని పొంగులేటి కోరారు. 

సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక పథకాలకు రూపకల్పన చేశారని...ఇకపై కూడా వారి పక్షానే నిలుస్తూ మరింత మంచి పథకాలను  తీసుకువస్తారని హామీ ఇచ్చారు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని సూచించారు. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

click me!