ఇండియా-పాక్, హిందూ-ముస్లిం తప్ప ఏం తెలీదు : మోడీపై కేటీఆర్ ఫైర్

By Siva KodatiFirst Published Apr 4, 2019, 5:09 PM IST
Highlights

టీఆర్ఎస్‌లోకి గురువారం భారీ స్థాయిలో చేరికలు జరిగాయి. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత ప్రవీణ్ రెడ్డి తెలంగాణలో భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

టీఆర్ఎస్‌లోకి గురువారం భారీ స్థాయిలో చేరికలు జరిగాయి. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత ప్రవీణ్ రెడ్డి తెలంగాణలో భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, వ్యవసాయం గురించి కేసీఆర్ ప్రస్తావించినప్పుడల్లా.. ముల్కనూర్, అంకాపూర్‌ల ప్రగతి గురించి చెబుతారన్నారు. వీటిలో ముల్కనూరు సొసైటీని ప్రవీణ్ రెడ్డి అద్భుతంగా నడిపిస్తున్నారని కేటీఆర్ ప్రశంసించారు.

సిరిసిల్ల కంటే హుస్నాబాద్ నియోజకవర్గానికే సాగునీరు ఎక్కువ విడుదలవుతుందన్నారు. అందరూ కలిసి వినోద్ కుమార్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

కేసీఆర్ పనితనాన్ని ప్రజలకు చాటి చెప్పాలంటే సమర్ధులైన నాయకులు కావాలన్నారు. 2014లో మోడీ ఏదో చేస్తారనుకుంటే ఐదేళ్ల తర్వాత పరిస్థితులు ఏమాత్రం మారలేదని కేటీఆర్ ఆరోపించారు.

ఎక్కడికెళ్లినా ఇండియా-పాకిస్తాన్ లేదంటే హిందూ-ముస్లిం అంటున్నారన్నారు. మోడీని చూసి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి కూడా విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేస్తే వాళ్లకొచ్చింది ఒకే ఒక్క సీటని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశానికి కావల్సింది చౌకీదార్‌లు, టేకేదార్లు కాదని ఒక జోర్దార్, ఒక అసర్ధార్, ఒక వఫాదార్, ఇక ఇమాన్‌దార్, ఒక జిమ్మేదార్ ఉండాలని కేటీఆర్ స్పష్టం చేశారు. 

click me!