ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కుంటున్నాం: చేవెళ్ల ప్రచారంలో కేటీఆర్

By Arun Kumar PFirst Published Mar 23, 2019, 6:59 PM IST
Highlights

ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలన్న పెద్దల మాటలను తాను విశ్వసిస్తానని... అందువల్లే చేవెళ్ల లోక్ సభ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టిపట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గత ఎన్నికల సందర్భంగా తమ పార్టీ నుండి ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని గుర్తుచేశారు. ఇలా కోల్పోయిన స్థానాన్ని మళ్లీ గెలుచుకుని సత్తా చాటతామన్న నమ్మకం వుందని కేటీఆర్ అన్నారు. 
 
అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి తాండూరు నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఇక్కడి కూడా ఈసారి టీఆర్ఎస్ కు భారీ మెజారిటీ వచ్చే అవకాశముందన్నారు. దీంతో పాటు పరిగిలో కూడా గత అసెంబ్లీ ఎన్నికల కంటే మెజారిటీ పెరుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇటీవల ఐఎఎన్ఎస్ అనే ప్రైవేట్ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులపై చేపట్టిన సర్వేలో మన సీఎం కేసీఆర్ మొదటి స్థానంలో నిలిచారని కేటీఆర్ అన్నారు. ప్రజాభిప్రాయం ఆధారంగా ఈ సర్వే చేపట్టగా అత్యధిక 70 శాతం పైగా ప్రజల అభిమానంతో కేసీఆర్ అత్యుత్తమ సీఎం ఎంపికవడం ఆనందంగా వుందన్నారు. దీని ద్వారా ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడయ్యారని అర్థమవుతోందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 

టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎక్కువ స్థానాలు గెలవాల్సిన అవసరం వుందో కేటీఆర్ వివరించారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు గెలిస్తే  రాహుల్‌, మోదీలకే లాభమని, టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే తెలంగాణకు లాభమన్నారు. తమను ప్రశ్నించే నాయకులకు ప్రజలు ఇదే విషయాన్ని చెప్పాలని కేటీఆర్ సూచించారు. 

ఇక ఈ సమావేశంలో మాజీ మంత్రి, స్థానిక నాయకులు పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ...సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందన్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఇవాళ జరిగిన భారీగా చేరికలతో పార్టీ మరింత బలోపేతం అయిందన్నారు.  రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలతో రంజిత్ రెడ్డి విజయం ఖాయమని పేర్కొన్నారు.  చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులమంతా కలిసికట్టుగా రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటామని మహేందర్ రెడ్డి తెలిపారు.  

click me!