ఒక్కసారికే రూ.15వేల కోట్లు...ఈసారి అంతకుమించి: కవిత

By Arun Kumar PFirst Published Mar 23, 2019, 4:44 PM IST
Highlights

ఒక్కసారి తనకు ఎంపీగా అవకాశమిచ్చినందుకే రూ.15 వేల కోట్ల పై చిలుకు నిధులు తీసుకొచ్చానని టీఆర్ఎస్ నిజామాబాద్ అభ్యర్థి కల్వకుంట కవిత తెలిపారు. అలాంటిది మరోసారి తనకు అవకాశం కల్పిస్తే అంతకు మించి నిధులు  తీసుకువచ్చి అభివృద్దిని పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. అందుకోసమే తనను మరోసారి ఎంపీగా గెలిపించాలని
నిజామాబాద్ ప్రజలను కవిత కోరారు. 

ఒక్కసారి తనకు ఎంపీగా అవకాశమిచ్చినందుకే రూ.15 వేల కోట్ల పై చిలుకు నిధులు తీసుకొచ్చానని టీఆర్ఎస్ నిజామాబాద్ అభ్యర్థి కల్వకుంట కవిత తెలిపారు. అలాంటిది మరోసారి తనకు అవకాశం కల్పిస్తే అంతకు మించి నిధులు  తీసుకువచ్చి అభివృద్దిని పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. అందుకోసమే తనను మరోసారి ఎంపీగా గెలిపించాలని
నిజామాబాద్ ప్రజలను కవిత కోరారు. 

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో గల జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో శనివారం ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో 16 కు 16 మంది టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇలా చేస్తే తెలంగాణ ఢిల్లీని శాసించే స్థాయిలోకి వెళుతుందన్నారు. 

టిఆర్ఎస్  అభ్యర్థులు గెలిస్తే  ఏం చేస్తారని జాతీయ పార్టీలు అంటున్నాయని గుర్తుచేశారు. అలాంటి వారికి ప్రాంతీయ పార్టీ అయిన టిఆర్ఎస్ ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించలేదా అని ప్రశ్నించాలని ప్రజలను కోరారు. 

తెలంగాణ ప్రభుత్వం రైతు బందు ను కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని ప్రారంభించాయని... ఇది సిఎం విజన్ కు నిదర్శమన్నారు. ఇలా యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. 

తెలంగాణ ప్రజలు కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే తాము బాగు పడతామని ఆలోచన చేస్తున్నారని తెలిపారు.  ఐదేళ్లలో ప్రభుత్వం చాలా కార్యక్రమాలను
చేపట్టిందని.. ఇంకా కొన్ని చేపట్టాల్సి ఉందని చెప్పారు.

మే నుంచి 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుందని  ప్రకటించారు. అలాగే పిఎఫ్ కార్డు ఉన్న బీడీ కార్మికులు అందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు.
 సొంత స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మే నెల నుండి ప్రారంభమవుతుందన్నారు. వచ్చే రెండేళ్లలోపు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టడం పూర్తి కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతామని కవిత వివరించారు. 

ఎంపీగా తెలంగాణ తో పాటు దేశ సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించాననీ కవిత తెలిపారు. హైకోర్టు విభజన, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్ల పెంపుకోసం ప్లకార్డులతో సభను స్తంభింపజేసిన విషయం ప్రజలకు తెలిసిందేనని చెప్పారు. తెలంగాణ గురించి ఆలోచించేది గులాబీ పార్టీ మాత్రమేనని ఎంపి కవిత అన్నారు. 

మన ఊరు - మన ఎంపి కార్యక్రమంలో భాగంగా ఈచపల్లిలో పాల్గొన్నానని... అప్పుడు ఊరి సమస్యలు తెలుసుకుని ఆ తర్వాత పరిష్కరించానని గుర్తుచేశారు. 10 కోట్ల రూపాయలతో రేచపల్లిని అభివృద్ది చేసినట్లు తెలిపారు. గతంలోనిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో 11 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టిడిపి అభ్యర్థులు గెలిచారని... వాళ్లేం చేశారో చెప్పాలన్నారు.   


 
జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్, బేర్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎంపి కవిత ప్రచారం చేపట్టారు. రోడ్ షో లలో ప్రజలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని మహిళలు మంగళహారతులు, బతుకమ్మలతో ఆమెకు స్వాగతం పలికారు.  ఆప్యాయంగా కవితకు బొట్టుపెట్టి ఆలింగనం చేసుకున్నారు.  
 

click me!