టీఆర్ఎస్ లో హరీష్ స్థాయి తగ్గింది ...అందువల్లే కారు జోరుకు బ్రేకులు: రఘు నందన్

By Arun Kumar PFirst Published Apr 9, 2019, 4:59 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల్లో సాగిన టీఆర్ఎస్ హవా పార్లమెంట్ ఎన్నికల్లో సాగదని బిజెపి మెదక్ లోక్ సభ అభ్యర్ధి రఘునందన్ అన్నారు.ఎందుకంటే ఆ పార్టీ గుర్తు కారుకున్న నాలుగు టైర్లలో హరీష్ అనే టైరు పంక్చరయ్యిందని... ఆ ప్రభావం ఈ లోక్ సభ ఎన్నికలపై స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తానేదో గాలికి ఇలా మాట్లాడటం లేదని... టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలను దగ్గరనుండి చూసిన వ్యక్తిగా తానీ వ్యాఖ్యలు చేస్తున్నట్లు రఘునందన్ పేర్కొన్నారు. 

మెదక్ లోక్ సభ ఎన్నికల్లో   బిజెపి తరపున పోటీ చేస్తున్న రఘునందన్ ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ టీవీఛానల్ తో మాట్లాడుతూ...  తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన హరీష్ పరిస్థితి ఇప్పుడే ఏమయ్యిందని ప్రశ్నించారు. ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న అతడు ఇప్పుడు కనీసం స్టార్ క్యాంపెయినర్ గా కూడా పనికిరాకుండా పోయాడు. అతడి పరిస్థితి అంతలా దిగజారిందని... టీఆర్ఎస్ లో ఎవరు గెలిచినా వారి పరిస్థితి హరీష్ మాదిరిగానే వుంటుందని రఘునందన్ అభిప్రాయపడ్డారు. 

కాబట్టి మెదక్ జిల్లాలో స్థానికున్ని... జిల్లా సమస్యలపై అవగాహన వున్న వ్యక్తినైన తనను గెలిపించాలని రఘునందన్ ప్రజలను కోరారు. ఎప్పుడూ ప్రజల్లోనే వుండే తాను ఎంపీగా గెలిచినా ప్రజల్లోనే వుంటానన్నారు. ఎల్లపుడూ అందుబాటులో వుండే ఎంపీ కావాలో...ఎన్నికలు అయిపోగానే ముఖం చాటేసే ఎంపీ కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. 

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని భావిస్తున్న ప్రజలు బిజెపి కి ఓటేయడానికి సిద్దంగా వున్నారన్నారు. పట్టణాల్లోనే కాదు గ్రామాల్లో కూడా ప్రజలు కేంద్రంలో ప్రధాని మోదీ పాలనను చూసి బిజెపికి ఓటెయ్యడానికి సిద్దమయ్యారని తెలిపారు. తాను గెలిస్తే స్ధానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగావశాలు, లోక్ సభ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని రఘునందన్ హామీ ఇచ్చారు. 

click me!