సర్జికల్ స్ట్రైక్స్‌పై వ్యాఖ్య: మోడీని టార్గెట్ చేసిన కేసీఆర్

By narsimha lodeFirst Published Mar 29, 2019, 6:19 PM IST
Highlights

సర్జికల్ స్ట్రైక్స్‌ను బూచిగా చూపి ఎన్నికల్లో  బీజేపీ ఓట్లు అడుగుతారా అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను బయటకు చెబుతారా అని ఆయన ప్రశ్నించారు. 

మిర్యాలగూడ: సర్జికల్ స్ట్రైక్స్‌ను బూచిగా చూపి ఎన్నికల్లో  బీజేపీ ఓట్లు అడుగుతారా అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను బయటకు చెబుతారా అని ఆయన ప్రశ్నించారు. 

శుక్రవారం నాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు సర్జికల్ స్ట్రైక్స్‌ను చూపి ఓట్లను అడుగుతారా అని మోడీపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. 

యూపీఏ హాయంలో తాను కేంద్ర మంత్రిగా పనిచేశానని ఆయన సమయంలో 11 దఫాలు సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే అజహర్ మసూద్ అనే వ్యక్తి ఒక్కరు కూడ మృతి చెందలేదని ప్రకటించిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు.సర్జికల్ స్ట్రైక్స్ విషయాన్ని బయటకు ఎవరూ కూడ చెప్పరని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

ఎన్నికల తర్వాత బీజేపీ భరతం పడుతామని కేసీఆర్ హెచ్చరించారు.  మే 23 వ తేదీ తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు కూడ దక్కవన్నారు. కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు కూడ రావన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటును ప్రాంతీయ పార్టీలే శాసించనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి మోడీ పచ్చి అబద్దాలు ఆడుతున్నాడని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలోని పథకాన్ని కాపీ కొట్టి కేంద్రం ఆయుష్మాన్ భవ పథకాన్ని తెచ్చిందని ఆయన విమర్శించారు.మోడీ స్వయంగా బీసీ అయినా కూడ బీసీ సామాజిక వర్గానికి కనీసం మంత్రిత్వశాఖను కేటాయించలేదని ఆయన విమర్శించారు.ఆరోగ్యశ్రీతో పోలిస్తే ఆయుష్మాన్ భవ పథకం నిరూపయోగమన్నారు. తెలంగాణలో బీజేపీ 118 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే ఒక్క సీటునే గెలిచిందన్నారు.

టిక్కెట్లు అమ్ముకొనే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని ఆయన చెప్పారు. తమ పార్టీలో టిక్కెట్లు అమ్ముకొనే సంస్కృతి  తమ పార్టీది కాదన్నారు. నల్గొండ ఎంపీ టిక్కెట్టును రూ.100 కోట్లకు అమ్ముకొన్నానని తనపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ చేసిన ఆరోపణలను  వాపస్ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సుఖేందర్ రెడ్డి టిక్కెట్టును తాను తీసివేయలేదని కేసీఆర్ వివరించారు. తాను పోటీ చేయబోనని ఆయనే చెప్పారు. అందుకే వేమిరెడ్డి నర్సింహరెడ్డికి టిక్కెట్టు ఇచ్చినట్టు ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పదవిని సుఖేందర్ రెడ్డికి ఇవ్వనున్నట్టు హామీ ఇచ్చానన్నారు. మరో వైపు సుఖేందర్ రెడ్డికి ఉన్నత స్థానంలో నిలుస్తారని ఆయన హామీ ఇచ్చారు.


 

click me!