టీ.కాంగ్రెస్‌కు షాక్: అర్థరాత్రి బీజేపీలో చేరిన డీకే అరుణ

Siva Kodati |  
Published : Mar 20, 2019, 09:16 AM IST
టీ.కాంగ్రెస్‌కు షాక్: అర్థరాత్రి బీజేపీలో చేరిన డీకే అరుణ

సారాంశం

వరుస పెట్టి ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటంతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కు మరో పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు

వరుస పెట్టి ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటంతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కు మరో పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు.

మంగళవారం అర్థరాత్రి ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షంలో అరుణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె తొలుత హైదరాబాద్‌లో రామ్‌మాధవ్‌తో భేటీ అయ్యారు.

అనంతరం అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడారు. సాయంత్రానికి ఢిల్లీ చేరుకుని స్పష్టమైన హామీతో కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో అరుణ మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.... సంక్రాంతి పండుగకి....
మంత్రి పదవి కన్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కే నా ఓటు: కేటీఆర్