కొందరి పీఠాలు కదిలిపోతున్నాయ్, ఫెడరల్ ఫ్రంట్ రావాల్సిందే: కేసీఆర్

By Nagaraju penumalaFirst Published Mar 19, 2019, 9:55 PM IST
Highlights

దేశంలో ఏం జరుగుతుందో చెప్పా ఏం జరగాలో చెప్పా. దీంతో కొందరి పీఠాలు కదిలిపోతున్నాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగసభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా ధనిక జిల్లాగా పేరుగాంచిందన్నారు. 
 

నిజామాబాద్ : దేశ ఆర్థిక విధానం పరిస్థితి సక్రమంగా లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. 

దేశంలో ఏం జరుగుతుందో చెప్పా ఏం జరగాలో చెప్పా. దీంతో కొందరి పీఠాలు కదిలిపోతున్నాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగసభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా ధనిక జిల్లాగా పేరుగాంచిందన్నారు. 

సమైక్యపాలకుల పుణ్యమని నిజాంసాగర్ ఎండిపోయేదన్నారు. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయంలో నిజామాబాద్ జిల్లా పరిషత్ పీఠంపై గులాబీ జెండా ఎగిరిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం గౌరవాన్ని నిలబెట్టిన జిల్లా నిజామాబాద్ జిల్లా అంటూ చెప్పుకొచ్చారు. 

15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రం సిద్ధించిందని కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నా మరికొన్ని సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్లు, రైతులకు పెట్టుబడి సాయం పెంచినట్లు తెలిపారు. 

ఉమ్మడి పాలనలో వేలాదిమంది నిజామాబాద్ బిడ్డలు గల్ఫ్ దేశాలకు వలసపోయారని ఇప్పుడు ఆ వలసలు తగ్గించామని స్పష్టం చేశారు. ఎర్రజొన్న రైతులు ధర రావడం లేదని బాధపడుతున్న రైతులకు కేసీఆర్ పలు సూచనలు చేశారు.

 గత కాంగ్రెస్ ప్రభుత్వం మిగిల్చిన ఎర్రజొన్న బకాయిలను టీఆర్ఎస్సే తీర్చిన విషయాన్ని గుర్తు చేశారు. మంది మాటలు పట్టుకుని ఎర్రజొన్న రైతులు ఆగం కావొద్దని మీతో ధర్నాలు చేయించిన మనుషులు తర్వాత మీతో ఉండరని సూచించారు. ఎర్రజొన్న రైతుల లబ్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

అటవీ భూముల సమస్యను పరిష్కరిస్తామని అలాగే సంచార జాతులకు సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. బ్యాంకుతో సంబంధం లేకుండా రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సంచార జాతులకు రూ.1000 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. 

దేశంలోని 16 రాష్ట్రాల్లో 52.32 లక్షల మంది బీడీ కార్మికులుంటే తెలంగాణలో 4.5లక్షల మంది బీడీ కార్మికులున్నారని వెల్లడించారు. బీడీ కార్మికుల బాధలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని కానీ తాము అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడంతోపాటు పింఛన్లు కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. 

బీడీ కార్మికులకు పింఛను రూ.2వేలకు పెంచి బడ్జెట్ లో పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నా కాంగ్రెస్, బీజేపీ నాయకులు నాటకాలు ఆడుతారే తప్ప పనులు జరుగవని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నేను తప్పు మాట్లాడినట్లు సామాజిక మాధ్యమాల్లో దుష్ఫ్రచారం చేస్తున్నారు. ఉన్న వాస్తవాలు మాట్లాడటం తప్పా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.
 

click me!
Last Updated Mar 19, 2019, 9:55 PM IST
click me!