ఈసారి అయిపోయింది,వచ్చే ఎన్నికల్లో అయినా...: ఓటర్లకు చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి విజ్ఞప్తి

By Arun Kumar PFirst Published Apr 11, 2019, 5:26 PM IST
Highlights

తెలంగాణలో గురువారం లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ మినహా మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే తాను పోటీచేస్తున్న చేవెళ్ల నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలిస్తే పొద్దున్నుండి బిజీబిజీగా గడిపిన టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ ఎంపీ, ఎంఎల్ఏ కాలనీలోని సెంట్రల్ నర్సరీ పోలింగ్ బూత్ లో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు హక్కు  వినియోగించుకున్నారు. 

ఓటేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...గత కొద్ది రోజులుగా తాము ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రజలకు సూచిస్తూ వస్తున్నామని గుర్తుచేశారు. అయినా కూడా నగరంలో ఓటింగ్ శాతం గతంలో కంటే పెరగినట్లు కనిపించడం లేదు. ఇలా ఓటింగ్ శాతం తగ్గడం ఎంతగానో బాధిస్తోందని రంజిత్ రెడ్డి తెలిపారు. 

ఇప్పటికే పోలింగ్ కు సమయం దగ్గరపడింది కాబట్టి ఏం చేయలేమని... వచ్చే ఎన్నికల్లో ఆయినా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అప్పుడైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ దాన్ని బలోపేతం చేయాలని అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఓటు హక్కే ప్రజల వజ్రాయుధమని దాన్ని వృధా చేయవద్దన్నారు. ఓటు వేయడానికి బద్దకించొద్దని రంజిత్ రెడ్డి నగర ఓటర్లకు సూచించారు. 
 
click me!