తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్: సునీత కోసం మెదక్ పెండింగ్

By Nagaraju penumalaFirst Published Mar 23, 2019, 4:33 PM IST
Highlights

ఇకపోతే మెదక్ పార్లమెంట్ స్థానాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి కోసమే మెదక్ పార్లమెంట్ సీటు పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం. ఆమె బీజేపీలో చేరే అంశంపై ఊగిసలాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను పార్టీలో తీసుకువచ్చేందుకు బీజేపీ నేత డీకే అరుణ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 


ఢిల్లీ: తెలంగాణ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది బీజేపీ జాతీయ నాయకత్వం. ఇప్పటికే మెుదటి జాబితా విడుదల చేసిన జాతీయ నాయకత్వం రెండో జాబితా విడుదల చేసింది. 

టీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎంపీ జి.వివేక్ బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. వివేక్ వస్తే పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చే యోచన చేసింది బీజేపీ జాతీయ నాయకత్వం. అయితే వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయిన నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. 

అటు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. 

అయితే పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ కు కూడా అభ్యర్థిని ప్రకటించింది అధిష్టానం. ఇకపోతే మెదక్ పార్లమెంట్ స్థానాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టింది. 

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి కోసమే మెదక్ పార్లమెంట్ సీటు పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం. ఆమె బీజేపీలో చేరే అంశంపై ఊగిసలాడుతున్నట్లు తెలుస్తోంది. 

దీంతో ఆమెను పార్టీలో తీసుకువచ్చేందుకు బీజేపీ నేత డీకే అరుణ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సునీతా లక్ష్మారెడ్డితో డీకే అరుణ మాట్లాడినట్లు తెలుస్తోంది. అందువల్లే మెదక్ స్థానాన్ని పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం. 

బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల వివరాలు.
1. ఆదిలాబాద్-సోయం బాబూరావు(ఎస్టీ)
2. పెద్దపల్లి  - ఎస్.కుమార్ (ఎస్సీ)
3. జహీరాబాద్- బాణాల లక్ష్మారెడ్డి
4. హైదరాబాద్ -భగవంత్ రావు
5. చేవెళ్ల - బి.జనార్థన్ రెడ్డి
6. ఖమ్మం- వాసుదేవ్ రావు
 

click me!