గల్లీలో మాత్రమే సేవకురాలిని...డిల్లీలో సైనికురాలిని: కవిత

By Arun Kumar PFirst Published Mar 28, 2019, 5:16 PM IST
Highlights

తెలంగాణ ప్రజలు మరోసారి తనకు ఎంపీగా అవకాశమిస్తే మీ సేవకురాలిగా పనిచేస్తానని నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. ఇలా నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గల్లీకి సేవకురాలిగా వుంటూ ప్రజా సమస్యలపై దృష్టిపెడతానన్నారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం వద్ద ఓ సైనికురాలిగా పోరాడి పరిష్కరిస్తానని కవిత హామీ ఇచ్చారు.

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ  సందర్భంగా గురువారం ఆమె బాల్కొండ నియోజకవర్గ  పరిధిలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...గతంలో మాదిరిగా మరోసారి తనకు ఎంపీగా అవకాశమిస్తే నియోజకవర్గ అభివృద్ది కోసం కృషిచేస్తానని అన్నారు. తెలంగాణ కు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీలపై పోరాడతానని అన్నారు. 

ఇక నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు కోసం చాలా కష్టపడ్డానని... లోక్ సభలో అనేక మార్లు దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసానని అన్నారు. పసుపు రైతుల కష్టాల తెలిసు కాబట్టే ఇంత పట్టుదలతో శ్రమించిన కేంద్రం పట్టించుకోలేదన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుచేసేవరకు తన పోరాటం ఆగదని కవిత వెల్లడించారు.

అలాగే ఎర్ర జొన్న  రైతులకు కూడా అండగా వుంటానని కవిత హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి గతేడాది రూ.150 కోట్లు వెచ్చించి  ఎర్ర జొన్నను కొనుగోలు చేసినట్లు కవిత గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా ఆ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అందించడానికి సిద్దంగా వున్నట్లు కవిత వెల్లడించారు. 

click me!