ప్రాంతీయ పార్టీల్లో మోదీ కన్నా సమర్థులు ఉన్నారు.. అసదుద్దీన్

By ramya NFirst Published Mar 28, 2019, 3:54 PM IST
Highlights

త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ హవా తగ్గిపోతుందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ హవా తగ్గిపోతుందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. గత ఎన్నికల్లో మోదీకి హవా బాగా ఎక్కువగా ఉందని.. కానీ ఈసారి మాత్రం అంత హవా లేదని ఆయన చెప్పారు.

కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కచ్చితంగా ప్రాంతీయ పార్టీకి చెందిన వ్యక్తే ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.ఈసారి ఎన్నికల్లో ప్రజలు తమకు నచ్చినవారికే ఓటు వేస్తారని చెప్పుకొచ్చారు.

అన్ని నియోజకవర్గాల్లోనూ గట్టి పోటీ ఉండే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ ఏర్పాటుచేసే కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమిలో ఎంఐఎం పాలు పంచుకుంటుందన్నారు.  ఈ ఫ్రంట్ కచ్చితంగా దేశంలో వైవిధ్యాన్ని కాపడుతుందని అన్నారు.

ప్రాంతీయ పార్టీల్లో మోదీ కన్నా సమర్థమైన నాయకులు చాలా మంది ఉన్నారని అభిప్రాయపడ్డారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ దేశ భద్రతను తెరపైకి తెస్తోందన్నారు. బీజేపీ ఇచ్చే తప్పుడు వాగ్దాలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని చెప్పుకొచ్చారు.

కొన్ని రోజులు సర్జికల్ స్ట్రైక్స్‌ని ప్రచారంలోకి తెచ్చారని, తర్వాత బాలాకోట్ దాడులను తెరపైకి తెచ్చారని ,తాజాగా మిషన్ శక్తిని ప్రచారంలోకి తెచ్చి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోందని ఘాటుగా విమర్శించారు.

బీజేపీలో ఓటమి భయం ఉంది కాబట్టే ఒక్కో అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. మరోవైపు సికింద్రాబాద్‌లో బీజేపీ గెలుపుకోసం టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదని, కాంగ్రెస్ పార్టీ కావాలనే ఈ ప్రచారాన్ని చేస్తోందని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

click me!