నిజామాబాద్‌ రైతు అభ్యర్థుల వినూత్న ప్రచారం... భారీ బహిరంగ సభ ఏర్పాటు

By Arun Kumar PFirst Published Apr 8, 2019, 6:22 PM IST
Highlights

తమ సమస్యల పరిష్కారం కోసం నిజామాబాద్ రైతులు లోక్ సభ ఎన్నికలను అస్త్రంగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ తమ సమస్యలను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలిచి సంచలనం సృష్టించారు. ఇలా దాదాపు 176 మంది రైతులు నిజామాబాద్ లోక్ సభ స్ధానం నుండి పోటీకి దిగడమే కాదు తమ ప్రచారాన్ని కూడా వినూత్న రీతిలో నిర్వహించేందుకు సిద్దమయ్యారు. 
 
తమ డిమాండ్‌ లను అన్ని రాజకీయ పార్టీలకు బలంగా వినిపించేందుకు ఓ భారీ బహిరంగసభ నిర్వహించేందుకు రైతు అభ్యర్ధులు సిద్దమయ్యారు. ఆర్మూరులో రేపు అనగా మంగళవారం రైతుల ఐక్యత సభ నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభావేధిక నుండి మరోసారి పసుపు, ఎర్రజొన్న రైతులతో పాటు ఇతర అన్నధాతల సమస్యలపై రైతులే గళం  విప్పనున్నారు. జిల్లాలోని రైతు సంఘాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వున్న రైతు సంఘాలు ఈ సభను విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. 

రాజకీయ పార్టీల ప్రచార సభల మాదిరిగా ఈ రైతు సభకు జనసమీరన వుండదని నిర్వహకులు తెలిపారు. తమ సమస్యలపై జరుగుతున్న పోరాటానికి మద్దతుగా రైతు కుటుంబాలే స్వచ్చందంగా ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభ ద్వారా మరోసారి తమ ఐక్యతను చాటిచెబుతామని రైతులు వెల్లడించారు. 

 తాము నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచినప్పటికి  ఈసి తమకు గుర్తులు కేటాయించలేదని...అందువల్ల ఈ ఎంపీ స్థానానికి ఎన్నికలను నిలిపివేయలేమని కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు.  ఇలా రైతు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాడు హైకోర్టు విచారణ  జరిపింది. ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ప్రచారానికి కేవలం రెండు రోజులే సమయం వుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేసి రైతులందరిని ఒక్కతాటిపైకి తేవాలని రైతు అభ్యర్ధులు బావిస్తున్నారు. అందుకోసం మంగళవారం భారీ బహిరంగకు ఏర్పాటు చేస్తున్నారు.   

నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి  185 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. వీరిలో 177 మంది రైతులే పోటీలో వుండగా మిగతావారు వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారున్నారు. వీరంతా పసుపు, ఎర్రజొన్న రైతులే కావడం విశేషం.   

click me!