పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన పొన్నం ప్రభాకర్

By Arun Kumar PFirst Published Apr 8, 2019, 5:31 PM IST
Highlights

కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ టీఆర్ఎల్ లో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై స్పందించిన పొన్నం పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో తనను దెబ్బతీసేందుకే ఇలా అసత్యాలతో కూడిన ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిందని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకే ఇలా మైండ్ గేమ్ ఆడుతున్నారని పొన్నం ఆరోపించారు.

తెలంగాణ కోసం పోరాడిన నాయకులు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ ను వీడుతుండగా... ఉద్యమంతో సంబంధంలేని, వ్యతిరేకించి నాయకులు టీఆర్ఎస్ లో చేరుతున్నారని విమర్శించారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న నాయకులకు ఆ పార్టీలో ప్రాదాన్యత తగ్గి వ్యతిరేకులకు పెరిగిందన్నారు. స్వరాష్ట్రం సిద్దించిన తర్వాత కూడా కొందరు ఉద్యమకారుల ఇంకా ఉద్యమాన్ని వీడకపోడానికి కారణం కూడా అదేనని పొన్నం తెలిపారు. 

తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పాత్ర మరువలేనిదని గుర్తుచేశారు. ఇలా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తనను ఒకప్పుడు పొగిడిన కేసీఆర్... రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు దూషిస్తున్నారని తెలిపారు. అందులోభాగంగానే తనకు వ్యతిరేకంగా ఓటు వేయమంటూ ప్రజలను కోరుతున్నారని...కానీ ఏం చేయాలో ప్రజలకు తెలుసని పొన్నం అన్నారు. 

కరీంనగర్ లో తనపై ఫోటీకి దిగిన టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా తనపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతరుడైనప్పటికి 2014 లో ఎంపీగా గెలిపించిన జిల్లాకే ఆయన అన్యాయం చేశారని ఆరోపించారు.  కరీంనగర్ కు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. కాబట్టి అన్ని సమయాల్లో ప్రజలకు అందుబాటులో  ఉండే లోకల్ నాయకుడినైన తనను మరోసారి గెలిపించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. 
 
click me!