కేసీఆర్‌కు షాక్: ఎమ్మెల్యే చిరుమర్తి భార్య కోమటిరెడ్డి వైపు

By narsimha lodeFirst Published Apr 10, 2019, 1:09 PM IST
Highlights

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భార్య పార్వతమ్మ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది.
 

నార్కట్‌పల్లి: నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భార్య పార్వతమ్మ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో నకిరేకల్ అసెంబ్లీ స్థానం నుండి చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే గత నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించారు.

                    

చిరుమర్తి లింగయ్యది, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిది ఒకే ఊరు. కోమటిరెడ్డి సోదరుల ప్రోత్సాహంతోనే చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నకిరేకల్ అసెంబ్లీ స్థానం నుండి 2009 ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్య తొలిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి వేముల వీరేశం చేతిలో చిరుమర్తి లింగయ్య ఓటమి పాలయ్యాడు. 2018 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి వేముల వీరేశంపై విజయం సాధించారు.                         

                        

 

ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్‌ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. ఆయన సోదరుడు మునుగోడు నుండి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించారు.

                                     

దీంతో భువనగిరి ఎంపీ స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భార్య పార్వతమ్మ మద్దతును ప్రకటించారు. భర్త కాంగ్రెస్ పార్టీని  వీడి టీఆర్ఎస్‌లో చేరితే... భార్య మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మద్దతు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

భువనగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ సాగుతున్న తరుణంలో ఈ పరిణామం మాత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

ట్విస్ట్: భర్త అడుగు జాడల్లోనే నడుస్తానన్న చిరుమర్తి భార్య

 

 

click me!