సిద్దిపేటలో టీఆర్ఎస్ రిగ్గింగ్‌: పోలింగ్ బూత్ ఎదుట కాంగ్రెస్ అభ్యర్థి నిరసన

By Arun Kumar PFirst Published Apr 11, 2019, 4:04 PM IST
Highlights

తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అయితే అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో మెదక్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ హటాత్తుగా ఓ పోలింగ్ బూత్ ఎదుట నిరసనకు దిగారు. సిద్దిపేట పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అవకతవకలకు పాల్పడటంతో తాను నిరసనకు దిగినట్లు ఆయన వెల్లడించారు. 
 
టీఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా వుండే సిద్దిపేట జిల్లాలో ఆ పార్టీ నాయకులు కొందరు రిగ్గింగ్ కు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. ఇబ్రహీంపూర్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు. ఏజంట్లపై దౌర్జన్యం ప్రదర్శిస్తూ రిగ్గింగ్ కు పాల్పడినట్లు తెలిపారు. దీంతో ఈ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది పేర్కొన్నారు.  ఈ విషయాన్ని తాను ఎన్నికల విధుల్లో వున్న పోలీసులు, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో ఇలా నిరసనకు దిగుతున్నట్లు అనిల్ కుమార్ వెల్లడించారు. 

ఇబ్రహీంపూర్ లోని పోలింగ్ బూత్ వద్ద ఆయన బైఠాయించి నిరసన తెలిపారు. ఇక్కడ పోలింగ్ ను నిలిపివేసి ఎన్నికల  నియమావళిని ఉళ్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. 

మెదక్ లోక్ సభ నియోజకవర్గానిక నుండి కాంగ్రెస్ తరపున గాలి అనిల్ కుమార్, టీఆర్ఎస్ నుండి కొత్త ప్రభాకర్ రెడ్డి, బిజెపి నుండి రఘునందర్ రావు పోటీ చేస్తున్నారు. ఇలా ముగ్గురు బలమైన నాయకులు పోటీ పడుతుండటంతో  మెదక్ లో పోరు హోరాహోరీగా సాగుతోంది.  

click me!