మోదీపై పాక్ ప్రధాని ఇమ్రాన్ కామెంట్స్: అసదుద్దిన్ ఓవైసి ఫైర్

By Arun Kumar PFirst Published Apr 11, 2019, 2:48 PM IST
Highlights

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత దేశానికి మరోసారి మోదీ ప్రధాని కావాలని తారు కోరుకుంటున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలు కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో వున్న బిజెపికి మరింత జోష్ అందించగా...ఇతర ప్రతిపక్ష పార్టీలకు మాత్రం మింగుడుపడటం లేదు. దీంతో పాక్ ప్రధానిపై విమర్శలకు దిగుతున్నారు. తాజాగా ఇమ్రాన్ వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఓవైసి ఫైర్ అయ్యారు. 

పాక్ ప్రధాని ఏ ఉద్దేశంతో మోదీ  మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారో తనకు అర్ధం కావడం లేదని ఓవైసి అన్నారు. అతడి వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. గురువారం తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా పాతబస్తీతో తన  ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఓవైసి మీడియాతో మాట్లాడారు. 

మోదీ ప్రధాని కావడంవల్ల కాశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందని  తాను అనుకోవడం లేదన్నారు. కశ్మీర్ ఏ ఒక్కరి ప్రైవేట్ ఆస్తి కాదని ఇమ్రాన్ గుర్తుంచుకోవాలని సూచించారు. భారత్‌-పాక్‌ మధ్య శాంతి చర్చలు సాగుతాయని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించడాన్ని ఓవైసి తప్పుబట్టారు. మోదీ ప్రధాని కావాలని కేవలం పాక్ ప్రధాని, ఎఎస్‌ఐ మాత్రమే కోరుకుంటున్నాయని అసదుద్దిన్ ఎద్దేవా చేశారు. 

click me!