కాదేది ప్రచారానికనర్హం...మెట్రో రైళ్ళో స్టార్ హీరోయిన్ ప్రచారం

By Arun Kumar PFirst Published Apr 9, 2019, 3:39 PM IST
Highlights

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు మరో రోజు మాత్రమే సమయం వుండటంతో ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఎండ వేడిమిని సైతం లెక్కచేయకుండా ప్రముఖ పార్టీల అభ్యర్థులు ప్రచారం కోసం రోడ్ల పైనే గడుపుతున్నారు. ఈ క్రమంలో నగరంలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ  అలనాటి స్టార్ హీరోయిన్ కుష్బూ ను బరిలోకి దింపింది. సోమవారం హైదరాబాద్ లోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ కు విచ్చేసిన ఆమె చేవెళ్ల లోక్ సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టారు.

అందరు నాయకుల్లాగా రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు కాకుండా ఆమె తన ప్రచారానికి మెట్రో ను ఎంచుకుంది. తమ అభ్యర్థిని వెంటపెట్టుకుని గాంధీభవన్ నుండి మెట్రో రైలులో ప్రయాణించిన కుష్బూ ప్రయాణికులను ఆత్మీయంగా పలకరించారు. ఈ మార్గంలో చిట్టచివరి స్టేషన్ మియాపూర్ వరకు తన ప్రయాణాన్ని మరియు ప్రచారాన్ని సాగించారు కుష్బూ. 

ఈ సందర్భంగా ఆమె ప్రయాణికులతో మాట్లాడుతూ.... ఇప్పుడు మనమంతా ప్రయాణిస్తున్న మెట్రో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చిందని గుర్తుచేశారు. ఇలాంటి బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి హైదరాబాద్ రవాణా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. ఇలాంటి మరిన్ని అభివృద్ది పనులు జరిగి రాష్ట్రం మొత్తం అభివృద్ది జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని సూచించారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ మెట్రోను శంషాబాద్‌ వరకు పొడిగించే ప్రయత్నం చేస్తామని కుష్బూ హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ కు అనుకుని వున్నా చేవెళ్ల నియోజకవర్గాన్ని జంట నగరాలకు ధీటుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తానని అన్నారు. అలా జరగాలంటూ తనను లోక్ సభ కు పంపించాలని మెట్రో ప్రయాణికులకు విశ్వేశ్వరరెడ్డి సూచించారు. 
 
click me!