నో టికెట్: సీతారాం నాయక్ తో మాలోతు కవిత భేటీ

Published : Mar 22, 2019, 09:24 PM ISTUpdated : Mar 22, 2019, 09:27 PM IST
నో టికెట్: సీతారాం నాయక్ తో మాలోతు కవిత భేటీ

సారాంశం

వరంగల్ లోని ఎంపీ సీతారాం నాయక్ నివాసానికి ఆమె  మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీవారితో క‌లిసి వెళ్లారు. నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం కృషి చేయాల‌ని ఈ సంద‌ర్భంగా సీతారాం నాయక్ ని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవిత కోరారు.

వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు సీతారాం నాయ‌క్‌తో మహబూబాబాద్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవిత భేటీ అయ్యారు. ఆమె సీతారాం నాయక్ ను శుక్ర‌వారం మర్యాదపూర్వకంగా కలిశారు. 

వరంగల్ లోని ఎంపీ సీతారాం నాయక్ నివాసానికి ఆమె  మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీవారితో క‌లిసి వెళ్లారు. నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం కృషి చేయాల‌ని ఈ సంద‌ర్భంగా సీతారాం నాయక్ ని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవిత కోరారు.

సిట్టింగ్ ఎంపీ అయిన సీతారాం నాయక్ కు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో మాలోతు కవితకు ఆయన ఎంపీ టికెట్ ఇచ్చారు. దీంతో ఆయన సహకారాన్ని కోరడానికి మాలోతు కవిత వెళ్లారు.  

PREV
click me!

Recommended Stories

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.... సంక్రాంతి పండుగకి....
మంత్రి పదవి కన్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కే నా ఓటు: కేటీఆర్