టీఆర్ఎస్ లో సీట్ల లొల్లి: వివేక్ రాజీనామా

By Nagaraju penumalaFirst Published Mar 22, 2019, 9:07 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపిచారు వివేక్. 2019 ఎన్నికల్లో పెద్దపల్లి లోక్ సభ టికెట్ ఆశించి భంగడపడ్డారు మాజీఎంపీ వివేక్. గతంలో 2019 ఎన్నికల్లో పెద్దపల్లి లోక్ సభ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. 

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పెద్దపల్లి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ జి.వివేక్ తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర

ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. 

తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపిచారు వివేక్. 2019 ఎన్నికల్లో పెద్దపల్లి లోక్ సభ టికెట్ ఆశించి భంగడపడ్డారు మాజీఎంపీ వివేక్. గతంలో 2019 ఎన్నికల్లో పెద్దపల్లి లోక్ సభ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. 

కానీ టికెట్ ఇవ్వకపోవడంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పెద్దపల్లి నియోజకవర్గం ప్రజలకు న్యాయం చెయ్యలేకపోతున్నాననే భావనతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. 

మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి శనివారం వివేక్ రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అనంతరం రామగుండంలో తన అనుచరులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహింబోతున్నట్లు తెలుస్తోంది. 

ఆత్మీయ సమావేశం అనంతరం భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తారని సమాచారం. ఇకపోతే వివేక్ ను కాంగ్రెస్ పార్టీలో చేరాలని కార్యకర్తలు అభిమానులు ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.  

click me!