భారీ మెజారిటీయే హరీష్ ఉనికిని దెబ్బతీస్తోంది: రాంమాధవ్

By Arun Kumar PFirst Published Mar 25, 2019, 5:56 PM IST
Highlights

గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కంటే అల్లుడు హరీష్ రావు ఎక్కువ మెజారిటీతో గెలవడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు నచ్చనట్లుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. అందువల్లే హరీష్  ను రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలా సిద్దిపేటలో సాధించిన లక్ష పైచిలుకు భారీ మెజారిటీయే హరీష్ ఉనికిని దెబ్బతీస్తోందని రాంమాధవ్ పేర్కొన్నారు. 

సోమవారం మహబూబ్ నగర్ బిజెపి లోక్ సభ అభ్యర్థి డికె అరుణ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో రాంమాధవ్ పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సొంత మేనల్లుడి ఎదుగుదలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సహించలేక పోతున్నారని అన్నారు. అలాంటిది ఇతరులు ఎదిగితే ఆయన అస్సలు తట్టుకోలేరని... అందువల్లే మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించలేదన్నారు. మంచి వ్యక్తిగా పేరుతెచ్చుకుంటూ రాజకీయంగా సొంత ఇమేజ్ ను సంపాదించుకుంటున్న ఆయన్ను కట్టడి చేయడానికే టికెట్ ఇవ్వలేదని రాంమాధవ్ ఆరోపించారు. 

ఇక గతంలో ఫెడరల్ ప్రంట్ పేరుతో నానా హంగామా చేసి ఎన్నికలు వచ్చేసరిని కేసీఆర్ మౌనం వహించడం ఏంటని ప్రశ్నించారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానన్న వ్యక్తి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. దీన్ని బట్టే వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో కేసీఆర్ కేవలం బ్రేక్ ఫాస్ట్, లంచ్ చర్చలే జరిపినట్లు తెలుస్తోందని...ఇలాంటి  చర్చలతో ప్రంట్ లు ఏర్పడవని రాంమాధవ్ ఎద్దేవా చేశారు. 

click me!