కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరదలి ఓటు తొలగింపు: వదిలిపెట్టబోనంటున్న శోభా కామినేని

By Arun Kumar PFirst Published Apr 11, 2019, 12:55 PM IST
Highlights

తెలంగాణ లో అత్యంత పోటా పోటీ పోరు వుంటుందనుకుంటున్న నియోజకవర్గాల్లో చేవెళ్ల ఒకటి. అయితే అక్కడ ఏకంగా  కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరదలు శోభా కామినేని ఓటు గల్లంతయ్యింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో వున్న ఆమె కేవలం తన ఓటు హక్కును వినియోగించుకోడానికే ఇండియాకు వచ్చారు. కానీ ఇలా ఓటర్ లిస్టులో పేరు లేకపోవడంతో ఓటు వేయలేకపోయారు.

దీనిపై శోభ మాట్లాడుతూ...భారత పౌరురాలిగా ఎన్నికల్లో ఓటేయలేకపోయిన ఈరోజు తన జీవితంలోనే అత్యంత దుర్దినమని అన్నారు. తాను పోలింగ్ బూత్ కు ఓటేయడానికి వెళ్లగా తనపేరు ఓటర్ లిస్టులో లేదంటూ ఓటేయడానికి అధికారులు అనుమతించలేరని తెలిపారు. అయితే గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను నిరభ్యంతరంగా ఓటేశానని...కానీ ఇప్పుడిలా తన ఓటు తొలగించడమేంటని ప్రశ్నించారు. 

తనను ఈ దేశ పౌరురాలిగా భావించడం లేదా? లేదంటే తన ఓటు అంత ముఖ్యమైంది కాదని అనుకుంటున్నారా? అంటూ శోభ ప్రశ్నించారు. ఇలా తన ఓటును తొలగించి నేరం చేశారని...ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుండి గతంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి పోటీకి దిగారు. ఆయనపై టీఆర్ఎస్ పార్టీ ప్రముఖ వ్యాపారవేత్త రంజిత్ రెడ్డిని బరిలోకి దింపింది.  దీంతో అక్కడ హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ క్రమంలో విశ్వేశ్వర్ రెడ్డి బంధువు ఓటే గల్లంతవడం తీవ్ర గందరగొళానికి దారితీసింది. 

click me!