మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కు తీవ్ర అనారోగ్యం...స్ట్రెచర్‌పై వచ్చి ఓటు

By Arun Kumar PFirst Published Apr 11, 2019, 12:17 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం నడవలేని స్థితిలో వున్నప్పటికి ఓటు హక్కును వినియోగించుకోడాన్ని మాత్రం విస్మరించలేదు. అంబులెన్స్ లో అబిడ్స్ పోలింగ్ బూత్ వద్దకు ఆయన్ను అంబులెన్స్ లో తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు స్ట్రెచర్ సాయంతో బూత్ లోకి తీసుకెళ్లారు. ఓటేసిన తర్వాత ఆయన్ని మళ్లీ అదే అంబులెన్స్ లో తీసుకెళ్లారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుండి ముఖేష్ గౌడ్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో ఆరోగ్యంగా వున్న ఆయన ముమ్మరంగా ప్రచారం కూడా చేపట్టారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా వుంటున్న అతడు ఈ మధ్య తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స  పొందుతున్నారు. 

మంచి పర్సనాలిటీతో ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపించే ముఖేష్ గౌడ్ ను ఇలా బక్కచిక్కి నడవలేని స్థితిలో వుండటం చేసి కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కోలుకుని మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా  పనిచేయాలని కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు తెలిపారు. 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ముఖేష్ గౌడ్ మంత్రివర్గంలో అవకాశం లభించింది. అయితే ఆ తర్వాత అదే గోషామహల్ నుండి వరుసగా ఓడిపోతూ ఆయన మెల్లిమెల్లిగా తన ప్రాభవాన్ని కోల్పోయారు. ఇలా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా బిజెపి అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓటమిపాలయ్యారు.

click me!